
సాక్షి, విజయవాడ: సొంతింటి కల సాకారం చేసి పేదల బతుకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 వేలు ఉచితంగా ఇస్తుందని తెలిపారు. 21వ డివిజన్‌లో 478 మందికి ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.(చదవండి: సొంతింటి కల సాకారం)
ఇల్లు లేనివారు ప్రతి మూడు నెలలకొకసారి ఇంటి కోసం పేరు నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో బస్టాండ్ కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 7,210 మంది లబ్ధిదారులకు అమరావతిలో పట్టాలు సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. ‘‘పట్టాల పంపిణీని టీడీపీ కోర్టుకెళ్లి అడ్డుకుంది. టీడీపీ చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు చూస్తున్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో పేదలను టీడీపీ మోసం చేసింది. సీఎం జగన్ పేద ప్రజలకు అండగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వక్తం చేస్తున్నారు. తీరు మార్చుకోకుంటే టీడీపీ ని ప్రజలు తరిమి కొట్టే రోజులు వస్తాయని’’ మల్లాది విష్ణు హెచ్చరించారు.(చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’)