
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్‌లో.. పైగా ముగ్గురు బైక్‌పై వెళ్తున్న యువకులు ప్రమాదం బారిన పడి మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కండ్రిక పాతపాడులో చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు విజయవాడలోని వాంబే కాలనీవాసులుగా పోలీసులు గుర్తించారు. అతి వేగంగా వెళ్తున్న ఆ యువకులు రోడ్డు మళ్లింపు ఉందనే విషయాన్ని గమనించకుండా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment