టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగ లేఖ రాశారు. అందులో చంద్రబాబు తీరును తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించి నిర్వీర్యం చేయించింది మీరు కాదా?.. బ్రిటీష్ వారి పాలనలో చేయని విధంగా మీ పాలన సాగిందన్న సంగతి గుర్తు లేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు.