ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు | Mudragada Padmanabham Wrote Letter To AP People | Sakshi
Sakshi News home page

ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు

May 10 2024 12:06 PM | Updated on May 10 2024 12:22 PM

Mudragada Padmanabham Wrote Letter To AP People

సాక్షి, కాకినాడ: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.

కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ తొక్కేవారు. ఇప్పుడు ఆ సైకిల్‌కి తుప్పు పట్టడంతో మోటర్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రేమాశీస్సులు ఉంచమని కోరుతున్నాను.

సీఎం జగన్‌కు ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారు. గతంలో వారి రాక్షస పాలన వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టాను ఒక్కసారి అందరూ చూడండి. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. పేదల సంక్షేమం చూసే ముఖ్యమంత్రి జగన్‌ను గౌరవించాలని కోరుతున్నాను’అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement