వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నా: ముద్రగడ | Mudragada Padmanabham Will Join YSRCP On March 14th | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నా: ముద్రగడ

Published Sun, Mar 10 2024 10:22 AM | Last Updated on Sun, Mar 10 2024 11:22 AM

Mudragada Padmanabham Will Join Ysrcp On March 14th - Sakshi

సాక్షి, కాకినాడ జిల్లా: ఈ నెల 14న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువాను ముద్రగడ కుటుంబం కప్పుకోనుంది. ఇటీవల కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నట్లు ముద్రగడ తెలిపారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. సీఎం జగన్‌ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ వెల్లడించారు.

ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement