కాకినాడ: పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదని లేఖలో కౌంటరిచ్చారు. ‘ మీరు సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదు.. నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు ఎందుకొచ్చింది. నీ వద్ద నేను నౌకరిగా పనిచేయడం లేదు కదా.. అటువంటప్పుడు నన్ను తిట్టించాల్సిన అవసరం ఏంటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు.
పవన్కు రాసిన లేఖలో ముద్రగడ ప్రస్తావించిన అంశాలు
- కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి
- ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి
- చేగువేరా మీకు ఆదర్శం అంటారు గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్తారు ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని భావిస్తున్నాను
- మీరు మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం
- గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు.. దమ్ముంటే మీరు నన్ను తిట్టండి
- నేను మీ బానిసను కాదు మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదు
- వంగవీటి హత్య ..తుని ఘటన తరువాత అమాయకులైన వారిని జైలులో వేశారు.
- ఏనాడైనా వారిని పరామర్శించారు. కనీసం వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారా?
Comments
Please login to add a commentAdd a comment