మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో ‘చలో కత్తిపూడి సమావేశం’ నిర్వహించడానికి తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్న నేపథ్యంలో ముద్రగడ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తూనే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఇందులో చంద్రబాబుకు అనేక ప్రశ్నలను సంధించారు ముద్రగడ.