Posani Krishna Murali Fires On Pawan Kalyan Over His Remarks, Details Inside - Sakshi
Sakshi News home page

పవన్‌ కాపులను తిడుతున్నారంటే ఎంత పెద్ద స్కెచ్‌ వేశారో?: పోసాని

Published Fri, Jun 23 2023 4:28 PM | Last Updated on Fri, Jun 23 2023 5:15 PM

Posani Krishna Murali Fires On Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు స్కెచ్‌ ప్రకారం పవన్‌ మాట్లాడుతున్నారని ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశాలతోనే కాపులను పవన్‌ తిడుతున్నారని దుయ్యబట్టారు. 1981 నుంచి ముద్రగడ కాపుల కోసం పోరాడుతున్నారని, ఆయన గొప్పతనం పవన్‌, చంద్రబాబులకు తెలియదన్న పోసాని.. కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారన్నారు.

‘‘ముద్రగడ ఏ రోజు కూడా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధిపొందలేదు. కాపుల కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ముద్రగడ. ముద్రగడ ఎనాడైనా తప్పు చేసినట్లు పవన్‌ నిరూపించలగలరా?. వంగవీటి మోహనరంగాను చంద్రబాబు చంపించారు.. ముద్రగడ గొప్పవాడా? పవన్‌ ప్రేమించే బాబు గొప్పవాడో గ్రహించాలి’’ అని పోసాని అన్నారు.

‘‘చంద్రబాబు అవినీతి పరుడని పవన్‌ కల్యాణ్‌ తిట్టారు. చంద్రబాబును తిట్టిన నోటితోనే ఇప్పుడు ఆయన సీఎం అవ్వాలంటున్నావు. కాపులను హింసించిన చంద్రబాబుకు మద్దతు తెలుపుతావా. ముద్రగడకు పవన్‌ క్షమాపణ చెప్తే తప్పేం కాదు. ముద్రగడలో అవినీతి, అసూయ లాంటివి లేవు. పవన్‌ ఎవరి కోసం పనిచేస్తున్నాడో కాపులు అర్థం చేసుకోవాలి. పవన్‌ కాపులను తిడుతున్నారంటే ఎంత పెద్ద స్కెచ్‌ వేశారో?’’ అంటూ పోసాని నిప్పులు చెరిగారు.
చదవండి: స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement