సాక్షి, హైదరాబాద్: వంగవీటి రంగాను చంద్రబాబే చంపించారనే విషయం అందరికీ తెలుసని APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఐదు జిల్లాల్లో వంగవీటి రంగా అంటే.. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కంటే గొప్పవాడని, అందుకే వంగవీటి రంగాను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. రంగా కారులో చిన్న కర్ర దొరికితే.. దాన్ని చూపించి రంగాను పీఎస్‌కు తీసుకెళ్లారని, తనను చంపేస్తారని రంగాకు కూడా ఒక స్టేజ్‌లో అర్థమైందని పోసాని తెలిపారు.
తనకు ప్రాణహాని ఉందని వంగవీటి రంగా నాడు రాజీవ్‌గాంధీకి లేఖ కూడా రాశారు. దీనిపై రాజీవ్ వేగంగా స్పందించారన్నారు. ఎన్డీఆర్‌ను మించిపోతున్నాడనే రంగాను హత్య చేయించారని పోసాని అన్నారు. ‘‘నేనున్నాంటూ ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు. మీరు అండగా ఉంటే సీఎం అవుతానని పవన్ చెప్పాడు. రంగా తరహాలో పవన్ ఉంటాడని కాపులంతా భావించారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను కూడా పవన్ తిట్టాడు. ఇప్పడు చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడు. తాను సీఎం కాలేనని పవనే చెబుతున్నాడు. చంద్రబాబుకే సీఎం అయ్యే అర్హత ఉందని పవన్ చెబుతున్నాడు. చంద్రబాబుకు కాపులందరూ ఎందుకు ఓటు వేయాలి’’ అంటూ పోసాని ప్రశ్నించారు.
‘‘సలహాలు ఇచ్చేవారంతా వైఎస్సార్‌సీపీ కోవర్టులంటూ పవన్ చెబుతున్నాడు. ముద్రగడను చంద్రబాబు ఎంత వేధించారో అందరికీ తెలుసు. ముద్రగడను వేధింపునప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పవన్ గగ్గొలు పెట్టాడు. పవన్ తన వెనకాల నాదెండ్ల మనోహర్‌ను పెట్టుకున్నాడు. పవన్ తన గుండెల్లో మాత్రం చంద్రబాబును పెట్టుకున్నాడు. కాపులను తిట్టిన వారితో పవన్ ఇప్పుడు ఎందుకు కలిసాడు’’ అంటూ పోసాని కృష్ణమురళి నిలదీశారు.
పోసాని కృష్ణ మురళి ప్రెస్‌మీట్‌లో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే
- కాపు కులస్తుల కోసమే ఈ ప్రెస్ మీట్
- కాపు సోదరులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత దగా చేస్తున్నారో, వారిని ఎంతగా అవమానిస్తున్నారో కాపులందరికీ తెలియాలి
- మళ్లీ కాపులను మోసం చేయడానికి బాబు, పవన్ వస్తున్నారు, వారిని గుర్తించాలి
- కాపుల ఆశా జ్యోతి వంగవీటి, మాకందరికి అయన పెద్ద హీరో
- ఆయన్ని ఎలా చంపారో ఈ పోస్టర్ మీకు చెబుతుంది
- రంగాను చంపించింది నారా చంద్ర బాబు నాయుడు
- రంగాని ఎవరు చంపించారో కాపులందరికీ తెలుసు, రంగా వాళ్ళ అబ్బాయి కూడా తెలుసు
- రంగా ఎమ్మెల్యేగా ఉన్నపుడు గుంటూరు, కృష్ణా, గోదావరి, ప్రకాశం, అయిదు జిల్లాల్లో మొత్తం 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చూపించగలిగాడు
- ఎన్టీఆర్ కంటే ఎక్కువ ప్రజల అభిమానం వచ్చిందన్న అనుమానంతో రంగాను చంపించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు
- ఆ రోజుల్లో రంగాను ఎంత హింసించారో అందరికి తెలుసు
- చనిపోతే బాగుండు అనిపించేలా రంగాను హింసించారు
- తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో సీఎం రామారావుకి హోమ్ మినిస్టర్ కోడెల కు సెక్యూరిటీ కోసం రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు
- అయినా చంద్రబాబు వల్ల రంగాకు భద్రత రాలేదు
- దీంతో సెక్యూరిటీ కోసం కేంద్రానికి రంగా లేఖ రాసాడు
- సెక్యూరిటీ వచ్చేలోపే రంగాను రోడ్ మీద నరికి చంపించారు
- రంగాను చంపినపుడు ఒక్క కాపు కూడా ఆ పూట అన్నం తినలేదు
- రంగా ఉంటె సీఎం అయ్యేవారు అని కాపులు భావించారు
- కాపుల్లో ఉన్న ఆవేదనను అవకాశవాదంగా మార్చుకుని పవన్ కళ్యాణ్ వచ్చాడు
- చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ లను పవన్ తిట్టడంతో కాపులు నమ్మారు
- పార్టీ పెట్టాను సీఎం అవుతాను అని పవన్ ప్రకటనలు చేస్తే కాపులు నమ్మారు
- అంతగా కాపులు నమ్మితే ఇప్పుడు పొత్తుల పేరిట 24కి పరిమితమయ్యాడు పవన్
- చంద్రబాబుకి సపోర్ట్ చేయాలనీ నాకు అంత సీన్ లేదని పవన్ చెప్తున్నాడు
- ఇపుడు కాపుల మనోభావాలు ఏమిటి?
- మోడీ నిజాయతీపరుడు అందుకే సపోర్ట్ చేశాను
- తెలంగాణ తెచ్చినందుకు కెసిఆర్ కు సపోర్ట్ చేశాను
- అందరికంటే జగన్ బెస్ట్ కాబట్టి జగన్ ను సపోర్ట్ చేశాను
- పవన్ కళ్యాణ్ నిజాయితి పరుడు అయితే ఆయనకి సపోర్ట్ చేసేవాడ్ని
- రంగ ని చంపినా వాడికి వోట్ వేయమని పవన్ చెప్తున్నాడు
- ముద్రగడ ను చంద్రబాబు అవమానించాడు అరెస్ట్ చేయించాడు
- కాపు ఆడపిల్లలను అవమానించాడు చంద్రబాబు
- అప్పుడు మాట్లాడని పవన్ అవినీతు కేసులో చంద్రబాబు జైలు కి వెళ్ళగానే వెళ్లి పలకరించాడు
- కాపులు రౌడీలు గుండాలు అన్న చంద్రబాబు కు వోట్ వేయాలని పవన్ చెప్తున్నాడు
- కాపుల్లో చదువుకున్న వాళ్ళు లేరా? నీకు చాతకానపుడు కాపుల్లో ఇంకొకరిని పెట్టాలి.!
- రంగాను చంపినా చంద్రబాబును సీఎం ఎలా చేయమంటావ్?
- కమ్మ కులంలో పుడితే బాగుండేదని పవన్ ఫీల్ అవుతున్నాడు.!
- రంగాని చంపినా వాడు సీఎం అయితే బాగుంటుందని పవన్ అభిప్రాయం.!
- నేను రంగా శిష్యుడ్ని
- రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్ కి వోట్ వేయవద్దు
ఇదీ చదవండి: పొత్తుల పితలాటకం
Comments
Please login to add a commentAdd a comment