కాకినాడ: కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదురుగుతున్నారంటూ ఇటీవల వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు పవన్‌ను ఉద్దేశించి.. ఓ సుదీర్ఘమైన ఘాటు లేఖ రాశారాయన. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితో ఉద్యమించానని, నేతలను విమర్శించడం మానేసి పవన్ అసలు విషయాలపై దృష్టిసారించాలని లేఖలో పవన్‌కు చురకలంటించారు ముద్రగడ.
👊 ‘నేను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు. నేను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా నేను ఉద్యమాలు చేయలేదు. చంద్రబాబు నాయుడి ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారు’ అని స్ట్రాంగ్‌గా బదులిచ్చారు ముద్రగడ.
కాపు ఉద్యమం ఎందుకు చేయలేదు?
👊 ‘నా కంటే చాలా బలవంతుడైన పవన్.. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి. జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలోనిదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏమిటో అడిగి తెలుసుకో పవన్. నా సమాధానం తర్వాత కాపు సామాజిక వర్గానికి రూ. 20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నాను. బీసీల నుంచి పిల్లి సుభాష్‌ని, కాపుల నుంచి బొత్సను సీఎం చేయమని అడిగా’ అని ముద్రగడ పవన్‌ను ఉద్దేశించి స్పష్టం చేశారు.
👊 నేను ఎవరినీ బెదిరించి ఇరువురు పెద్దలు, పవన్ దగ్గర రూ.కోట్లు పొందలేదు. నేను ఎప్పుడూ ఓటమి ఎరుగను. కాపు ఉద్యమంతో ఓటమితో దగ్గరయ్యా. నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకో అంటూ పవన్‌కు చురకలంటించారాయన.
సలహాలు వదిలేసి.. విమర్శలా?
👊 ఎమ్మెల్యేలను తిట్టడానికి విలువైన సమయం వృధా చేసుకోకండి. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడడం, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్ సమస్యలపై పోరాటం చేయాలని 2019లో నా వద్దకు వచ్చిన రాయబారులకు సలహా ఇచ్చి పంపాను. సలహాలు అడిగారు కానీ గాలికి వదిలేశారు. పవన్‌ను నిజంగా రాష్ట్రప్రజలపై ప్రేమ ఉంటే నా సలహాల ఆధారంగా యుద్ధం చేయండి.
ద్వారంపూడి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
👊 పార్టీ పెట్టిన తర్వాత పదిమంది చేత ప్రేమించబడాలిగానీ.. వీధి రౌడీభాషలో మాట్లాడడం ఎంతవరకూ న్యాయమంటారు?. పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం నుంచి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే తండ్రి, తాతది తప్పుడు మార్గాల్లో సంపాదన అనే మాట చాలా తప్పు. ద్వాంరపూడిపై గెలిచి పవన్ తన సత్తా ఏమిటో చూపించాలి.
Comments
Please login to add a commentAdd a comment