
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా లేఖ రాశారు.
ఈ లేఖలో ముద్రగడ..‘ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను. సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్‌తో చేయించాలని ఆశతో ఉన్నాను.
మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు.. చేయను. ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకొని తాడేపల్లికి రావాలని కోరారు. ఈ క్రమంలో ముద్రగడ లేఖను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment