
గోకవరం: సంక్రాంతి, ఉగాది పండుగలకు గ్రామాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు వంటివాటికి ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వాలని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. లేఖ ప్రతులను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విడుదల చేశారు. ఈ ప్రాంత వాసులకు సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువు లాగే పందేలు, ఆటల పోటీలు, జాతరలు తదితర వాటిని ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఈ మధ్యకాలంలో పండుగ ఉత్సవాల్లో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులు పెట్టడం, చివరిలో అనుమతిస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు రోజుల పాటు పూర్తిస్థాయిలో ఆటలకు అనుమతి ఇవ్వాలని, పండుగలప్పుడు ప్రజలను జైలుకి తీసుకెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment