
సాక్షి, కాకినాడ: పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ బహిరంగ లేఖ విడుదల చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలుపుతున్నారు కాపు ఉద్యమ నేతలు, అభిమానులు. ఈ క్రమంలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి కాపు ఉద్యమ నేతలు, అభిమానులు చేరుకుంటున్నారు.
ఈ మేరకు కాపు ఉద్యమ నేతలు మాట్లాడుతూ.. ‘గోదావరి జిల్లాల్లో పవన్‌ను కాపులు నమ్మే పరిస్థితి లేదు. ఓ పొలిటిషియన్‌గా పవన్ మాట్లాడే భాష సరికాదు. పవన్‌కు ఏమాత్ర రాజకీయ అనుభవం లేదు. గుండు కొట్టించుకున్న అనుభవం పవన్‌కు ఉంది.కాపు ఉద్యమం కోసం మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. కాపు ఉద్యమం కోసం ముద్రగడ అలుపెరగని పోరాటం చేశారు. లేఖలో ముద్రగడ ప్రస్తావించిన అంశాలు అక్షరసత్యం’ అని స్పష్టంచేశారు.
చదవండి: ఎందరి నార తీశారు? ఎందరికి గుండు గీయించారు? పవన్‌కు ముద్రగడ ఘాటు లేఖ