తూర్పు గోదావరి జిల్లా: కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు దిగింది. తమ డిమాండ్లను సాధించుకునే దిశగా గత నెలలో కాకినాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చారు.