కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధంతో పాటు కాపు నేతల అరెస్ట్‌లపై వైఎస్‌ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ కాపులను అణచివేస్తున్న చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారన్నారు. జిల్లా నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. హామీని అమలు చేయాలని కోరడమే కాపులు చేసిన తప్పా? అని కన్నబాబు ప్రశ్నించారు. కాపులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు భవిష్యత్‌లో ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు.