కాపు నేతలను విమర్శించే స్థాయి ‘చలమలశెట్టి’కి లేదు
Published Sun, Sep 4 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా
అమలాపురం టౌన్: రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్యకు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, చిరంజీవి, దాసరి నారాయణరావును విమర్శించే స్థాయి లేదని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆ పదవి చేపట్టే వరకూ కూడా కాపులన్న సంగతి రాష్ట్రంలోని కాపులకే తెలియదని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఇటీవల తరచూ ముద్రగడను విమర్శిస్తూ, కాపు జాతిని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజప్ప మాట్లాడితే కాపులపై కేసులు, జైళ్లూ అంటున్నారని, తనకు అంతట పదవి ఇచ్చిన వారి మెప్పు కోసం ఆయన అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వానికి కాపులు బుద్ధి చెప్పే రోజు రాక మానదనిహెచ్చరించారు.
Advertisement
Advertisement