nalla
-
కాపు నేతలను విమర్శించే స్థాయి ‘చలమలశెట్టి’కి లేదు
కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా అమలాపురం టౌన్: రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్యకు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, చిరంజీవి, దాసరి నారాయణరావును విమర్శించే స్థాయి లేదని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆ పదవి చేపట్టే వరకూ కూడా కాపులన్న సంగతి రాష్ట్రంలోని కాపులకే తెలియదని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఇటీవల తరచూ ముద్రగడను విమర్శిస్తూ, కాపు జాతిని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజప్ప మాట్లాడితే కాపులపై కేసులు, జైళ్లూ అంటున్నారని, తనకు అంతట పదవి ఇచ్చిన వారి మెప్పు కోసం ఆయన అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వానికి కాపులు బుద్ధి చెప్పే రోజు రాక మానదనిహెచ్చరించారు. -
ఓసీ హక్కుల కోసం ఉద్యమిస్తాం
ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్‌రెడ్డి కోహెడ: అగ్రవర్ణ పేదల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్‌రెడ్డి అన్నారు. కోహెడలోని వేంకటేశ్వర గార్డెన్లో మంగళవారం నిర్వహించిన జేఏసీ మండలస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు రూ.10 వేల కోట్లతో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ పథకాలలో పేద ఓసీలకు లబ్ధి చేకూర్చాలన్నారు. ఓసీ సంక్షేమ వసతిగృహాన్ని మంజూరు చేయాలని, 19 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కవితారెడ్డి, సలహాదారులు కేశవరెడ్డి, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు మల్లికార్జున్‌రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి వంశీధర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు రామచంద్రరెడ్డి, రమాదేవి, సరోజన, శ్రీధర్, జగన్‌రెడ్డి, భారతమ్మ, నాగలక్ష్మి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.