ఓసీ హక్కుల కోసం ఉద్యమిస్తాం | fight for rights | Sakshi
Sakshi News home page

ఓసీ హక్కుల కోసం ఉద్యమిస్తాం

Published Tue, Aug 16 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

fight for rights

  • ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్‌రెడ్డి
  • కోహెడ: అగ్రవర్ణ పేదల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్‌రెడ్డి అన్నారు. కోహెడలోని వేంకటేశ్వర గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన జేఏసీ మండలస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు రూ.10 వేల కోట్లతో ఓసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ పథకాలలో పేద ఓసీలకు లబ్ధి చేకూర్చాలన్నారు. ఓసీ సంక్షేమ వసతిగృహాన్ని మంజూరు చేయాలని, 19 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కవితారెడ్డి, సలహాదారులు కేశవరెడ్డి, జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌రెడ్డి, యూత్‌ ప్రధాన కార్యదర్శి వంశీధర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు రామచంద్రరెడ్డి, రమాదేవి, సరోజన, శ్రీధర్, జగన్‌రెడ్డి, భారతమ్మ, నాగలక్ష్మి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement