'హవ్వా ఫైవ్ స్టార్ హోటల్లో నివాసమా' | ambati rambabu slams chandrababu naidu over family shifted to park hyatt hotel | Sakshi
Sakshi News home page

'హవ్వా ఫైవ్ స్టార్ హోటల్లో నివాసమా'

Published Tue, May 24 2016 1:50 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM

'హవ్వా ఫైవ్ స్టార్ హోటల్లో నివాసమా' - Sakshi

'హవ్వా ఫైవ్ స్టార్ హోటల్లో నివాసమా'

హైదరాబాద్ : ఓ వైపు రాష్ట్రం ఆర్థికలోటుతో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు (చదవండి....ఫైవ్ స్టార్ హోటల్‌లో చంద్రబాబు నివాసం) తక్షణమే స్టార్ హోటల్ బస నుంచి చంద్రబాబు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. దుబరా ఖర్చులు చేస్తూ చంద్రబాబు నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం  వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

'కాపు భవనాలు, సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని, మీరే జీవో విడుదల చేసి నాటకాడుతున్నది వాస్తవం కాదా?. మేధావులు, స్వామీజీలకు రాజకీయాలు అంటగట్టడం దారుణం. హామీలు అమలు చేయాలని వాళ్లు కోరితే అందుకు వైఎస్ జగన్ను నిందిస్తారా?. ముద్రగడ పద్మనాభంను విమర్శిస్తూ కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మినీ మహానాడు పేరుతోనూ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. అవి మినీ మహానాడులు కాదు...మనీ మహానాడులు. ఎన్నికల వాగ్దానాలపై చర్చించకుండా వైఎస్ జగన్ను దూషించడం సరికాదు.' అని అంబటి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement