హామీలు రెండేళ్లలో అమలు చేయాలి
అధికారం చేపట్టేందుకు అమాయక ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చి, నమ్మించి ఓట్లు వేయించుకుంటున్నారని, హామీలు అమలు చేయాలని అడిగితే ప్రజలను పోలీసులతో కొట్టించడం, తిట్టించడం, తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడంలాంటివి చేసి భయంకరమైన పాలన సాగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. హామీలపై ఉన్నతస్థాయిలో నియంత్రణ లేకపోవడంతో నాయకులు అధికారం కోసం అబద్ధాలు చెప్పడానికి వెనుకాడటంలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను పదవీకాలం ముగిసేసరికి తూతూమంత్రంగా అమలు చేసి అన్నీ నెరవేర్చామని చెబుతున్నారని, ఇలాంటివారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.