PMModi
-
కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారు?: రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కోదండరాం కాంగ్రెస్ కోసం పోటీ చేయకపోతే కేఏ పాల్ బీఆర్ఎస్ కోసమే పోటీ చేయడం లేదా చెప్పాలని ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని ఆరోపించారు. ఈ కుటుంబాన్ని శిక్షించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి వాసననే పడని మోదీ కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. మోదీకి కంపు కొట్టకుండా కేసీఆర్ ఏదైనా సెంటు కొట్టి వశీకరణ చేస్తున్నారా? చెప్పాలన్నారు.ఇద్దరం ఒకటే అని కేసీఆర్,మోదీ చెప్పదలచుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారి ఆశలు పెరిగాయన్నారు. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు,నిర్మాణం వేరుకావడం వల్లే మునిగిపోతున్నాయి.కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్ లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. కమిషన్లు నొక్కేయడానికే కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారు’అని రేవంత్ విమర్శించారు. -
కర్ణాటకలో మా పొరపాట్లు కొన్ని ఉన్నాయి అందుకే ఇలా జరిగింది
-
ఏఐ ఫొటోస్ : మోదీ ఇలా ఉంటారా? సూపర్!
-
మోదీపై మరోసారి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
-
కర్ణాటక ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
-
కాంగ్రెస్ మేనిఫెస్టో పై మోదీ సంచలన వ్యాఖ్యలు
-
ఆ తిట్లతో రాస్తే పుస్తకాలు నిండుతాయి
-
కాశీలో తెలుగు సంగమం గంగా పుష్కర్ ఆరాధన...ముఖ్య అతిధిగా మోదీ
-
నా పని నేను చేస్కుంటా కాంగ్రెస్ నేతలపై మోదీ ఫైర్
-
విషం చుట్టూ తిరుగుతున్న కన్నడ రాజకీయం
-
ప్రధాని మోదీ మనసు గెలిచిన చిన్నారి
-
కేరళలో మొట్టమొదటి వందే భారత్ ప్రారంభం
-
సభలో మోదీ ఏం మాట్లాడుతారన్న దానిపై ఉత్కంఠ
-
యువర్ అటెన్షన్ ప్లీజ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్తగా ప్రారంభించనున్న ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ ఎంఎంటీఎస్ మార్గాన్ని మరో 6 కిలోమీటర్లు పొడిగిస్తే చాలు.శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు వెళ్లిపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొనే ప్రయాణికులు అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్రం ఈ ఏడాది రూ.600 కోట్లు కేటాయించింది. మరో రూ.300 కోట్లు కేటాయిస్తే ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఆరు కిలోమీటర్లు కొత్త లైన్లు నిరి్మంచడంతో పాటు విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తవుతుంది. అధునాతన ఎంఎంటీఎస్ రైళ్లను ఎయిర్‌పోర్టు వరకు నడపవచ్చు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులోనే ఎయిర్‌పోర్టు వరకు కనెక్టివిటీని ప్రతిపాదించినప్పటికీ అప్పట్లో ఎయిర్‌పోర్టులో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు జీఎమ్మార్ సంస్థ అంగీకరించకపోవడంతో ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టింది. ఎయిర్‌పోర్టులో మెట్రో స్టేషన్‌తో పాటు, మెట్రో డిపోను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మెట్రోకు సమాంతరంగా ఎంఎంటీఎస్‌ను కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. రైల్వేస్టేషన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం జీఎమ్మార్ సంస్థను ఒప్పించగలిగితే ఎంఎంటీఎస్ పరుగులు పెడుతుందని రైల్వేవర్గాలు పేర్కొంటున్నాయి. తక్కువ చార్జీలతో ప్రయాణం ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ చార్జీలు కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.15 వరకు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు వరకు రైల్వేసేవలను విస్తరిస్తే ఈ చార్జీలు రూ.25 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కేవలం విమాన ప్రయాణికులే కాకుండా ఉద్యోగులు, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరానికి కూరగాయలు, పాలు తదితర వస్తువులను తెచ్చి విక్రయించే చిరువ్యాపారులు, విద్యార్థులకు మెరుగైన రవాణా సదుపాయాలు లభిస్తాయి. అదే సమయంలో ఎయిర్‌పోర్టులో పనిచేసే ఉద్యోగులు కూడా తక్కువ చార్జీలతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించగలుగుతారు. సికింద్రాబాద్ నుంచే కాకుండా లింగంపల్లి, హైటెక్‌సిటీ, బేగంపేట్, తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ఎయిర్‌పోర్టులో అతి తక్కువ విస్తీర్ణంలోనే ఎంఎంటీఎస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. కానీ జీఎమ్మార్ ససేమిరా అనడంతో ఉందానగర్ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ప్రత్యేకంగా ఈ రూట్‌పైన దృష్టి సారించి జీఎమ్మార్‌ను ఒప్పించగలిగితే వేలాది మందికి తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఒక్క రూట్ పూర్తయితే ఎంఎంటీఎస్–2 సమగ్రమవుతుంది. అన్ని సదుపాయాలు ఉండాల్సిందే.. ప్రస్తుతం సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనాలతో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రభుత్వం చేపట్టింది. నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు రాయదుర్గం మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. ఈ రూట్లో మెట్రో అవసరమే. కానీ కేవలం రూ.300 కోట్లతో 6 కిలోమీటర్లు పూర్తి చేస్తే ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. మెట్రో, ఎంఎంటీఎస్ కూడా వినియోగంలోకి వస్తే ప్రపంచంలోని వివిధ నగరాల్లో ఉన్నట్లుగానే ఎయిర్‌పోర్టుకు విస్తృతమైన ప్రజారవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. -
ముఖ్యమంత్రులు-న్యాయమూర్తుల సంయుక్త సదస్సు 2022 (ఫొటోలు)
-
వైట్ హౌస్ వేదికగా క్వాడ్ శిఖరాగ్ర సదస్సు
-
కంగనాను కలిసే టైం ఉంది..కానీ : పవార్ ఫైర్
సాక్షి ముంబై: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్,కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం పట్ల కేంద్రం వైఖరిపై మండిపడ్డారు. గత 60 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ముంబైలో రైతు ర్యాలీనుద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన శరద్‌పవార్ ప్రధానమంత్రి నరంద్రమోదీ తీరును తప్పుపట్టారు. అంతేకాదు ఇంతకు ముందు అలాంటి గవర్నర్‌ను చూడలేదంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీపై విమర్శలు గుప్పించారు రైతు ఉద్యమకారులు గవర్నర్‌ను కలవాలన్న ప్రణాళికపై శరద్‌పవార్ స్పందిస్తూ.. గవర్నర్‌కు కంగనా ( బాలీవుడ్ హీరోయిన్) ను కలిసే ససమయం ఉంది కానీ, రైతులను కలిసి ఉద్దేశం లేదంటూ ఎద్దేవా చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను మీరు కలవడం గవర్నర్ కనీస నైతిక బాధ్యత అని వ్యాఖ్యానించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలమంది రైతులు ఎముకలు కొరికే చలిలో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. చలి,ఎండ వర్షం లాంటి పరిస్థితులకు వెరవకుండా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారని పవార్ వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఆందోళనపై కనీసం ఆరా తీయక పోవడాన్ని తప్పుపట్టారు. తమ హక్కులకోసం ఉద్యమిస్తున్న రైతులు పాకిస్థానీయులా పంజాబ్ పాకిస్తాన్లో ఉందా అని శరద్ పవార్ ఘాటుగా ప్రశ్నించారు. -
పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగం, లాక్డౌన్ పొడిగింపు పరిణామాలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ట్విటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్నక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని స్వాగతించిన చిదంబరం, పేదలు, వలస, రోజువారీ కార్మికుల జీవనోపాధి, మనుగడపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను ప్రకటించేముందు ప్రధాని మోదీ పేదల జీవనంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.ఈ సంక్షోభ సమయంలో పేదలకు కనీస నగదు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, అదే మొదటి ప్రాధాన్యతగా వుండాల్సి వుందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన మండి పడ్డారు. డబ్బు, ఆహారం ఉన్నా ప్రభుత్వం పేదలకు కేటాయించడంలో సుముఖత చూపలేదు. దీంతో వారి జీవితాలు, మనుగడ లాంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేవని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీంతో పేదలు 21+19 రోజులు ఆకలితో అలమటిస్తూ లాక్డౌన్ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. నా ప్రియమైన దేశమా శోకించు అని ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని నాల్గవసారి జాతికిచ్చిన సందేశంలో కొత్తగా ఏమీలేదని మాజీ ఆర్థికమంత్రి విమర్శించారు. లాక్డౌన్ సంక్షోభం నుంచి పేదలు ఎలా బయటపడతారనే దాని గురించి ప్రధాని ఏమీ చెప్పలేదు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన ఆర్థిక సాయంపై ఎలాంటి స్పందన లేదు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా అదనంగా జోడించలేదని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన చర్యలేవీ మోదీ ప్రస్తావించలేదని నిరాశ వ్యక్తం చేశారు. రాష్ట్రాలు రుణాలు తీసుకుంటే, ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం, కేంద్రం అప్పు తీసుకొని రాష్ట్రాలకు రుణాలు ఇవ్వాలని చిదంబరం సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా, జీన్ డ్రేజ్, ప్రభాత్ పట్నాయక్, అభిజిత్ బెనర్జీ లాంటి ఆర్థిక నిపుణుల సలహాలేవీ ప్రధాని చెవికి చేరకపోవడం శోచనీయమన్నారు. (కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం) కాగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. పౌరులు సహకరించి క్రమశిక్షణను కొనసాగిస్తేనే కోవిడ్-19 వ్యతిరేక పోరాటం విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) The poor have been left to fend for themselves for 21+19 days, including practically soliciting food. There is money, there is food, but the government will not release either money or food. Cry, my beloved country. — P. Chidambaram (@PChidambaram_IN) April 14, 2020 -
‘పీఎం మోదీ’పై స్టేకు నో
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ’సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండానే విడుదలపై స్టే ఇవ్వాలని కోరడం తగదంది. ఇక ఈ సినిమా విడుదల విషయంలో ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించమని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. ఒకవేళ ఈ సినిమాలో బీజేపీకి అనుకూలించే అంశాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరుపుతున్న క్రమంలో మోదీ బయోపిక్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సదరు సన్నివేశాల వీడియో క్లిప్పింగులను తమ ముందుంచాలని కోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ వీడియోలను ప్రవేశపెట్టడంలో పిటిషనర్ విఫలమయ్యారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేవలం రెండు నిమిషాల ట్రైలర్‌ను చూసి సినిమా విడుదలను నిలిపివేయాలని కోరడం తగదని వ్యాఖ్యానించింది. -
హైదరాబాద్‌లో ఇవాంక
-
హామీలు రెండేళ్లలో అమలు చేయాలి
- లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాలను సవరించాలి - ప్రధాని మోదీకి కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ కిర్లంపూడి (జగ్గంపేట): ఎన్నికల మేనిఫెస్టోలోను, ప్రచారంలోను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు అమలు చేసేవిధంగా నిబంధన విధించాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఒకవేళ ఆ హామీలు అమలు చేయకపోతే కఠినచర్యలు తీసుకునేందుకు చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకర్లకు విడుదల చేశారు. అధికారం చేపట్టేందుకు అమాయక ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చి, నమ్మించి ఓట్లు వేయించుకుంటున్నారని, హామీలు అమలు చేయాలని అడిగితే ప్రజలను పోలీసులతో కొట్టించడం, తిట్టించడం, తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడంలాంటివి చేసి భయంకరమైన పాలన సాగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. హామీలపై ఉన్నతస్థాయిలో నియంత్రణ లేకపోవడంతో నాయకులు అధికారం కోసం అబద్ధాలు చెప్పడానికి వెనుకాడటంలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను పదవీకాలం ముగిసేసరికి తూతూమంత్రంగా అమలు చేసి అన్నీ నెరవేర్చామని చెబుతున్నారని, ఇలాంటివారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.