కిర్లంపూడి : కిర్లంపూడిలోని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహానికి మంగళవారం నేతల తాకిడి ఎక్కువైంది. కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం విరమించిన విషయం విదితమే. జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, విశాఖ, విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు కాపు నాయకులు, ముద్రగడ అభిమానులు కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి అభినందనలు తెలియజేశారు. మంగళవారం మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడును ముద్రగడను కలిసి అభినందనలు తెలిపారు.
ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు పాలంకి ప్రసాద్, ఏడిద కోట సత్యనారాయణ, వనుంరెడ్డి శ్రీనివాస్, గుగ్గులపు మురళి పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, ఆకుల రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు గుండా రమణ, వాసిరెడ్డి ఏసుదాసు, ప్రగడ సుబ్బారావు, మలకల చంటిబాబు, గౌతు స్వామి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు చల్లా ప్రభాకరరావు, చల్లా భూషణం, చిన్నం హరిబాబు, బండారు శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ పెంటకోట నాగబాబు ముద్రగడను కలిశారు.
ముద్రగడ ఇంటికి నేతల తాకిడి
Published Wed, Feb 10 2016 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement