కాపు ఓట్లతో గద్దెనెక్కి వారిని దగా చేసిందే చంద్రబాబు
హామీలిచ్చి అమలు చేయని చంద్రబాబు
నవరత్నాలతోపాటు అన్ని విధాలుగా అండగా నిలిచిన జగన్
కాపు కార్పొరేషన్‌కు బాబు ప్రకటించిందే రూ.1,874.67 కోట్లు
అందులోనూ రూ.540 కోట్లు కోత.. విడుదల చేసింది రూ.1,334 కోట్లే
బాబు పెట్టిన ఈ బకాయిలను కూడా చెల్లించింది వైఎస్ జగన్ ప్రభుత్వమే
సీఎం జగన్ కాపు కార్పొరేషన్ ద్వారా కలిగించిన లబ్ధి రూ.15,044.64 కోట్లు
నవరత్న పథకాలతో కాపులకు అన్ని విధాలుగా చేయూత
ఈ ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా కాపులకు ఇచ్చింది రూ.39,317.80కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాపుల మదిలో విష బీజాలు నాటి చంద్రబాబుకు మేలు చేయాలనే కుతంత్రంతో రామోజీరావు అడ్డగోలుగా మరో తప్పుడు కథనాన్ని వండి వార్చారు. ‘కాపులకు జగన్ దగా’ అంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఈనాడులో విషం కక్కారు. అసలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకొని వారి ఓట్లతో గద్దెనెక్కి వారిని వంచించి వదిలేసిందే చంద్రబాబు. ఇది జగమెరిగిన సత్యం.
రిజర్వేషన్లు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు వంటి ఎన్నో హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా కాపులను దారుణంగా దగా చేశారు. ఒక్క కాపులే కాదు.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేశారు. మోసాలకు కేరాఫ్ చంద్రబాబు అన్న ముద్ర వేసుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ మాత్రం మాయ మాటలతో తాను మభ్య పెట్టలేనని, చేసేదే చెబుతానని నిఖార్‌సైన నాయకుడిగా నిలబడ్డారు. ఇచ్చి న మాటను నిలబెట్టుకుంటూ నవరత్న పథకాలతో కాపులను అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ పెట్టి వారికి నిజమైన మేలు చేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపుల్లోని పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాటునందించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు.
సీఎం జగన్ 58 నెలల పాలనలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.39,317.80 కోట్లు ఆర్థిక సాయమందించి సీఎం జగన్ రికార్డు సృష్టించారు. రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ కాపుల ఉన్నతిలో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వసనీయత, నిబద్ధత, నిజాయతీకి సీఎం వైఎస్ జగన్ మారుపేరు. ఈ విషయాలన్నీ తెలిసీ రామోజీ అసత్య కథనంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు.
రామోజీ ఇలాంటి కథనాలు ఎన్ని అచ్చేసినా చంద్రబాబుకున్న మోసాలకు కేరాఫ్ ముద్రా పోదు.. సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న విశ్వసనీయతకు మారు పేరన్న గౌరవమూ తగ్గదు. రామోజీ అచ్చేసిన కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిస్తే..
ఆరోపణ: కార్పొరేషన్‌ను నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు?
వాస్తవం: కాపు కార్పొరేషన్‌ను గత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది తెలిసినా ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబుకు రాజకీయ మేలు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై రామోజీ బురద రాతలకు దిగజారారు. కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరుపుతానని మాట ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా 2014 నుండి 2017 వరుకు ఒక్క రూపాయీ విదల్చలేదు.
2017 నుండి 2019 వరకు రూ.1,874.67 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విడుదల చేసింది రూ.1,334 కోట్లే. అంతే ప్రకటించిన మొత్తంలో రూ.540 కోట్లు బకాయి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు పెట్టిన బకాయిలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల అభ్యున్నతికి కాపు కార్పొరేషన్ ద్వారా చేయూతనిచ్చి ంది.
కాపు కార్పొరేషన్ ద్వారా రూ.15,044.64 కోట్లతో వైఎస్సార్ కాపు నేస్తం, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ అసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది.
ఆరోపణ: గత ప్రభుత్వ హయాంలో రూ1,441 కోట్ల మేర రాయితీ రుణాలు
వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రూ.1,441.75 కోట్లు మేరకు రాయితీ రుణాలు ఇచ్చి నట్టు చంద్రబాబు గురించి గొప్పలు చెప్పిన ఈనాడు.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు మించి నిధులు కేటాయించినప్పటికీ మసిపూసి మారేడు కాయ చేసేలా అబద్ధాలు రాసేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 (ఈ ఏడాది మార్చి) వరకు 19,81,458 మంది లబ్దిదారులకు రూ.3,260.87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది.
వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి వాటికి నిధులు విడుదల చేసింది. వాహన మిత్ర పథకంలో 58 నెలల కాలంలో 25,046 మందికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.132.57 కోట్లు ఆర్థిక సాయం అందించింది.
ఆరోపణ: నైపుణ్య శిక్షణ నిలిపేశారు
వాస్తవం: నైపుణ్య శిక్షణ పేరుతో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ సంస్థలకు బకాయిలు పెట్టిన రూ.8.83 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం విద్యోన్నతి అంటూ గొప్పలు చెప్పిన పథకంలో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ ఇచ్చి న సంస్థలకు బకాయి పెట్టిన రూ.6.15 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–2024 ఏడాదికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ద్వారా అర్హత కలిగిన కాపు విద్యార్ధులకు లక్ష రూపాయలు చొప్పున 23 మందికి రూ.23 లక్షలు అందించింది.
ఆరోపణ: కాపు భవన నిర్మాణాలపైనా జగన్ కన్నుకుట్టింది
వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలు చెప్పి మంజూరు చేసిన భవనాల్లో ఒక్క దానికీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించలేదు. అదీ చంద్రబాబు సర్కారు ఘనత. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా నెల్లూరు మున్సిపాలిటీలో, బాపట్ల జిల్లా ఏల్చూరు, అడవిపాలెం, చందలూరులో నాలుగు కాపు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించింది. ఇదీ సీఎం వైఎస్ జగన్ నిబద్ధత.
ఆరోపణ: విదేశీ విద్య దక్కకుండా కుతంత్రాలు
వాస్తవం: గత ప్రభుత్వం చేపట్టిన విదేశీ విద్యా పథకంలో అక్రమాలు, అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. దీంతో ఈ పథకాన్ని మరింత మెరుగులు దిద్ది పేద వర్గాలకు మేలు చేసేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2015–16 నుండి 2018–19 వరకు 307 మంది విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.20.97 కోట్ల మేర బకాయిలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది.
2022 నుంచి 2024 (మార్చి) వరకు విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 60 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.15.62 కోట్లు అందించి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల్లో 2019 నుంచి 2024 వరకు 8,41,677 మంది కాపు విద్యార్ధుల కోసం వారి తల్లులకు రూ.3,950.79 కోట్లు అందించింది.
Comments
Please login to add a commentAdd a comment