'కాపు జాతిలో చిచ్చు పెట్టాలని చూడొద్దు'
రాజమండ్రి: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందని, వాటిని అణచివేయాలని చూడటం దారుణమని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. టీడీపీ కాపు నేతలతో తనపై సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ కాపు ద్రోహి అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, కుర్చీ కోసం కాపు జాతిలో చిచ్చు పెట్టాలని చూడొద్దని హెచ్చరించారు. కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.
తన పై టెర్రరిస్ట్ ముద్రవేయాలని చూస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు ఇక్కడికి వచ్చారని ముద్రగడ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను అమ్మేసి చంద్రబాబు మన భూములను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. హోదాను ఢిల్లీకి, మన భూములు సింగపూర్ కు చంద్రబాబు అమ్మేశారన్నారు. దమ్ము, ధైర్యముంటే తుని లాంటి మీటింగ్ పెట్టండన్నారు. ఉద్యమాల నుంచి మధ్యలో ఒదులుకోవడంగానీ, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేయడం తనకు తెలియదని మద్రగడ తెలిపారు.