చంద్రబాబు ఆటలు సాగనివ్వం | Kapu leaders fires on chadrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆటలు సాగనివ్వం

Published Sat, Dec 3 2016 1:57 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

Kapu leaders fires on chadrababu

రాష్ట్ర కాపు జేఏసీ నేతల తీర్మానం

 సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాట ఇచ్చి తప్పడమే కాకుండా కాపులను అణచివేసేందుకు చంద్రబాబు ఆడుతున్న ఆటలు సాగనివ్వరాదని, వచ్చే రెండేళ్లలో బాబుతో తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీ నిర్ణరుుంచింది. కాపుల ఉద్యమాన్ని మాత్రమే అణచివేసేందుకు చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా బెదరకుండా పోరాడాలని తీర్మానించింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం కాపులకు బీసీ రిజర్వేషన్‌లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలి అని జేఏసీ నిర్ణరుుంచింది.

అవసరమైతే ఉద్యమాన్ని ఢిల్లీ స్థారుుకి తీసుకువెళ్లేందుకు కూడా సిద్ధపడాలని తీర్మానించింది.  తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జేఏసీ నేత వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా తమకు తీవ్రవాదులుగా ముద్రవేస్తున్న చంద్రబాబు తీరును గ్రామగ్రామానా ఎండగట్టాలని నేతలు తీర్మానించారు. సమావేశం అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ముద్రగడ మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement