భావితరాల భవిష్యత్ కోసం తరలిరండి
‘చలో అమరావతి’పై కాపులకు ముద్రగడ బహిరంగ లేఖ
కిర్లంపూడి(జగ్గంపేట): ‘చావో రేవో.. చలో అమరావతి’ పేరుతో ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు భారీగా తరలిరావాలని కాపులకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇది ఆఖరి పోరాటమని, భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ముద్రగడ మంగళవారం ఈ మేరకు కాపులకు బహి రంగ లేఖ రాశారు. పోలీసులు ఎన్నిసార్లు అరెస్టు చేసినా ‘పాదయాత్రకు వెళతాం.. కాదంటే జైలుకు పంపుకోండి’ అని ధైర్యంగా చెప్పాలని కాపులకు సూచించా రు. యాత్రలో పాల్గొంటే కేసులు పెడతామంటూ ప్రభుత్వ పెద్దలు పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు.