Chalo Amaravati
-
విద్యుత్ కార్మికులపై ఉక్కుపాదం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ‘చలో అమరావతి’ కార్యక్రమం చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యుత్‌శాఖలోని ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్, పీస్ రేట్ రద్దు, విద్యుత్సంస్థలో కార్మికులను విలీనం చేయాలనే తదితర ప్రధాన డిమాండ్లతో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చలో అమరావతి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు తరలివచ్చారు. తొలుత ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లకు పైబడి విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులుగా మగ్గుతున్నామని, తమ బాధలు ఆలకించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ వద్దకు ప్రభుత్వ ప్రతినిధులు గానీ, యాజమాన్యం గానీ వచ్చి డిమాండ్లు పరిష్కరిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కార్మికులు మండిపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు కమిటీల పేరుతో కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికులు ధర్నాచౌక్ నుంచి అమరావతి వెళ్లేందుకు రోడ్డెక్కారు. భారీగా మోహరించిన పోలీసులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల చర్యను అడ్డుకున్నారు. వారిని రోడ్లపై పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో విసిరేశారు. ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన దూరప్రాంతాల వారిని సైతం వెంటపడి లాక్కొచ్చి వాహనాల్లోకి ఎక్కించారు. ఆ సమయంలో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. కార్మికులు చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్మికులను అరెస్టు చేసి ఉయ్యూరు, పమిడిముక్కల, నున్న పోలీస్స్టేషన్లకు తరలించారు. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక చైర్మన్ బాలకాశి మాట్లాడుతూ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే పోలీసులతో అరెస్టు చేయించారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక వైస్ చైర్మన్ స్వతంత్రకుమార్, సెక్రటరీ జనరల్ మల్లికార్జునరెడ్డి, కన్వీనర్ వి.గంగయ్య, కట్టా నాగరాజు, కె.నారాయణరెడ్డి, 13 జిల్లాల కార్మికులు పాల్గొన్నారు. -
ఆగస్ట్ 2 వరకూ ముద్రగడ హౌస్ అరెస్ట్
-
ఆగస్ట్ 2 వరకూ ముద్రగడ హౌస్ అరెస్ట్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కిర్లంపూడిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా ముద్రగడను వచ్చే నెల 2వ తేదీ వరకూ గృహ నిర్భంధం చేస్తున్నట్లు చేశారు. కాగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సెక్షన్ 144 (3) ప్రకారం ముద్రగడను గృహ నిర్బంధం చేసినట్లు ఓఎస్డీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. కాగా నిన్న 24 గంటల పాటు ఆయనను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇవాళ ఏకంగా వారం పాటు ఆయనను హౌస్ అరెస్ట్ చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ‘నేను అంతర్జాతీయ తీవ్రవాదినా? నాపై కేసులుంటే అరెస్ట్ చేసుకోండి. మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు అణిచివేత ధోరణి మానుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆగస్ట్ 3వ తేదీ ఉదయం 9గంటలకు బయటకు వస్తా. పాదయాత్ర చేస్తా’ అని తెలిపారు. మరోవైపు ముద్రగడ మీడియాతో మాట్లాడేందుకు కాపు నేతలు అనుమతి కోరారు. -
తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు!
-
‘చలో అమరావతి’పై ఉక్కుపాదం
-
ముట్టడిలో కిర్లంపూడి
‘చలో అమరావతి’పై ఉక్కుపాదం - ఇటు హక్కుల పోరు.. - అటు అణచివేత హోరు - కిర్లంపూడి దారులన్నీ బంద్.. సాయుధ బలగాల కవాతు -‘తూర్పు’ దిగ్బంధం.. పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తనిఖీలు - పాదయాత్ర చేసి తీరతామంటున్న ముద్రగడ.. సర్వత్రా ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి అమరావతి: గజానికో పోలీసు చెక్‌పోస్టు.. కిలోమీటర్‌కో బారికేడ్... అడుగడుగునా నిఘా.. వీధివీధినా ఖాకీల బూట్ల చప్పుళ్లు.. తుపాకులతో సాయుధ దళాల కవాతు.. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే నిఘా నేత్రాలు.. నోటీసులు, అరెస్టులు, బైండోవర్ కేసులు.. ఇదీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పరిస్థితి. కాపు రిజర్వేషన్ల పోరాట సమితి కార్యక్షేత్రం కిర్లంపూడి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. కిర్లంపూడిలో సాయుధ బలగాల కవాతు చూసి జనం విస్తుపోతు న్నారు. ‘కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను బలహీన వర్గాల జాబితాలో చేర్చుతామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనే కదా వారు అడుగుతున్నారు. అందుకోసమే కదా ‘చలో అమరావతి’ పాదయాత్ర చేస్తున్నారు. దానిపై ఇలా ఉక్కుపాదం మోపడమేమిటా’ అని జనం ఆశ్చర్యపోతున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడి నుంచి బుధవారం ‘ఛలో అమరావతి’ పాదయాత్రకు సమాయత్తం అవుతున్నారు. ఆయన ఇలా పాదయాత్రకు పూనుకోవడం ఇది మూడోసారి. పాదయా త్రను అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం, చేసి తీరుతామని కాపు నేతలు భీష్మించడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం కిర్లంపూడిలో ఏమి జరుగనున్నదన్న ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ సహా కాపు నేతలు ఆకుల రామకృష్ణ, ఏసుదాసు, నల్లా విష్ణు, ఆరేటి ప్రకాశ్ వంటి ప్రముఖులందర్నీ ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. వేలాది మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా పోలీసుల వలయంలో చిక్కుకుంది. ఏడు వేలకుపైగా బలగాలతో జిల్లాను దిగ్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 చెక్‌పోస్టులు, 116 పికెట్లు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలు సహా వివిధ ప్రాంతాల్లో సెక్షన్ 144, 30ని ప్రకటించారు. నలుగురికి మించి గుమికూడకుండా, కలిసి నడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. సచివాలయానికి వెళ్లే దారిలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం పాదయాత్ర ప్రారంభమయ్యే కిర్లంపూడి గ్రామం పోలీసుల దిగ్బంధంలో ఉంది. భారీ ప్రత్యేక బలగాలతోపాటు ర్యాపిడ్ ఫోర్స్, తదితర బలగాలు ఎక్కడికక్కడ మాటు వేసి ఉన్నాయి. కిర్లంపూడికొచ్చే దారులన్నీ దాదాపు మూసేస్తున్నారు. ఏదో ఒక ఐడీ కార్డు చూపిస్తే తప్ప ఆ గ్రామస్తులను కిర్లంపూడిలోకి రానివ్వడం లేదు. అన్ని ఏర్పాట్లతో ముద్రగడ సన్నద్ధం షెడ్యూల్ ప్రకారం ‘చలో అమరావతి’ పాదయాత్రను బుధవారం ప్రారంభించేం దుకు ముద్రగడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద్యమానికి సహకరిస్తున్న వారందరికీ తమ వేగుల ద్వారా సమాచారం పంపించారు. అంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరదామని సంకేతాలు పంపించారు. పోలీసులు వ్యూహ ప్రతి వ్యూహాలకు, ఎత్తుకు పైఎత్తులను గమనిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే కాపునేతలెవరూ కిర్లంపూడి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా కాపు నేత కిర్లంపూడికి వస్తే ఆ డివిజన్ సూపరింటెండెంట్, సీఐ, ఎస్ఐలే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. నేటి కార్యక్రమం ఇలా... ముద్రగడ అనుచరుల కథనం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు ఆయన తన అనుచరులతో భేటీ అవుతారు. అల్పాహారం అనంతరం ఇంటి నుంచి బయటకు వస్తారు. కుటుంబ సభ్యులు వీడ్కోలు పలుకుతారు. 9.30 గంటలకు ఇంటి గేటు దాటుతారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే తన అనుచరులు పాదయాత్రను కొనసాగిస్తారు. అనుమతి లేదు: డీజీపీ ముద్రగడ యాత్రకు అనుమతి లేదని, ఆ యాత్రలో ఎవరూ పాల్గొనవద్దని డీజీపీ సాంబశివరావు మరోసారి హెచ్చరించారు. కిర్లంపూడిలోని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే యాత్రకు అనుమతి లేదని, లోనికి వెళ్లాలని కోరతామని, ఆయన ఇంటిలోనికి వెళ్లిపోతారని భావిస్తున్నామ న్నారు. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పద్మనాభం అసలు యాత్రకు అనుమతి కోరలేదని చెప్పారు. ఒక జిల్లా పరిధి దాటిన కార్యక్రమాలకు డీజీపీ అనుమతివ్వాల్సి వుంటుందని, కానీ తన వద్దకు ఎటువంటి దరఖాస్తు రాలేదన్నారు. -
పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్...
-
పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్...
విజయవాడ: చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి చేసుకోలేదని తెలిపారు. పాదయాత్రలో ఎవరు పాల్గొనకూడదని ఆయన సూచించారు. డీజీపీ మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేది లేదని, అలాగే వెనకడుగు వేసేది లేదన్నారు. కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని, ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. చట్టం గౌరవం లేకుంటే అందరికీ నష్టం జరుగుతుందన్నారు. ఇక ఏపీలో డ్రగ్స్ కంటే గంజాయి సమస్య ఎక్కువగా ఉందని, గంజాయి సరఫరా చాలావిధాలుగా జరుగుతుంనద్నారు. అలాగే బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టామని డీజీపీ పేర్కొన్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా కాపుల రిజర్వేషన్లపై ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి చలో అమరావతి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. -
‘చలో అమరావతి’పై ఉత్కంఠ
-
‘చలో అమరావతి’పై ఉత్కంఠ
ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదంటున్న ప్రభుత్వం - ఆరునూరైనా నిర్వహించి తీరుతామని కాపు నేతల స్పష్టీకరణ - కొనసాగుతున్న తనిఖీలు, అరెస్టులు, నోటీసులు, హెచ్చరికలు - తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీగా పోలీసుల మోహరింపు సాక్షి, రాజమహేంద్రవరం/గుంటూరు: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘చావోరేవో.. చలో అమరావతి’ పాదయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెబుతుండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని కాపు జేఏసీ నేతలు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ముద్రగడ సొంత జిల్లా తూర్పు గోదావరితోపాటు గుంటూరు జిల్లాలో పోలీసులు ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, తనిఖీలు, అరెస్టులు, నోటీసులు, హెచ్చరికలతో వాతావరణం వేడెక్కుతోంది. ఈ నెల 26వ తేదీన స్వగ్రామం కిర్లంపూడిలో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిర్లంపూడితోపాటు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. కాపు జేఏసీ నేతలు ఆదివారం కిర్లంపూడిలో సమావేశమయ్యారు. పాదయాత్ర జరిపి తీరుతామని ప్రకటించారు. పోలీసుల దిగ్బంధంలో కిర్లంపూడి ముద్రగడ సొంత ఊరు కిర్లంపూడిని పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ రెండు వేల మంది పోలీసులు మోహరించారు. గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులను దిగ్బంధించారు. ముద్రగడ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాను ఆయన ఇంటిపై తరచూ తిప్పుతూ అక్కడి పరిస్థితిని రికార్డు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను ముద్రగడ నివాసంలోకి వెళ్లనివ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా కవాతులు పాదయాత్రకు సమయం దగ్గర పడడంతో పోలీసులు జిల్లాలోని సున్నిత ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఆదివారం వందలాది మంది పోలీసులు సామర్లకోట, ఉప్పలగుప్తం, ద్రాక్షారామం తదితర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 500 మందిని బైండోవర్ చేశారు. కాపులు నక్సలైట్లా? తీవ్రవాదులా? ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆగదని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ముద్రగడతో సమావేశం అనంతరం కాపు నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు విలేకరులతో మాట్లాడారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని చెప్పినా ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తారు.కాపులు నక్సలైట్లా? తీవ్రవాదులా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో కాపు జాతి తిరగబడటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కాపు నేతలను కట్టడి చేస్తున్న పోలీసులు పాదయాత్రలో కాపులు పాల్గొనకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో పోలీసులు ఆంక్షలను పెంచారు. జిల్లాలోని కాపు సంఘం నేతలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా గత నాలుగు రోజులుగా 50కి పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. 5 వేల మందితో బందోబస్తు గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో ఐదు వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ సాధికార కమిటీ చైర్మన్ ఊరిబండి శ్రీకాంత్‌తో పాటు 15 మంది కాపు నేతలను ఆదివారం నగరపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు స్పష్టం చేశారు. రూరల్ జిల్లా పరిధిలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాపు నేతలు, ట్రావెల్స్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తుని ఘటన ఫొటోలను ఈ సందర్భంగా ఎస్పీ మీడియాకు చూపించారు. -
పోలీసుల గుప్పిట్లో కిర్లంపుడి!
-
పోలీసుల గుప్పిట్లో కిర్లంపూడి!
‘ఛలో అమరావతి’పై భారీ నిర్బంధం కాకినాడ: బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తున్న కాపులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి 'ఛలో అమరావతి' పేరిట కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపడుతుండటంతో.. ఈ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని సర్కారు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. పాదయాత్ర తేదీ దగ్గరపడుతున్న కొద్దీ తూర్పు గోదావరి జిల్లాలో సర్కారు పోలీసు నిర్బంధాన్ని పెంచుతోంది. కాపు ఉద్యమానికి కేంద్రమైన కిర్లంపూడి ప్రస్తుతం ఖాకీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కాపు నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మూడురోజులుగా కిర్లంపుడిలో 144 సెక్షన్ అమలవుతోంది. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి.. వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ నివాసం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. బయటి వ్యక్తులు ముద్రగడ నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పాదయాత్రకు తరలిరాకుండా కాపునేతలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదుచేస్తున్నారు. ఇలా అడుగడుగున పాదయాత్రను అడ్డుకునేందుకు ఆంక్షలు, కఠినమైన నిర్బంధాన్ని ప్రయోగించడంపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. -
భావితరాల భవిష్యత్ కోసం తరలిరండి
‘చలో అమరావతి’పై కాపులకు ముద్రగడ బహిరంగ లేఖ కిర్లంపూడి(జగ్గంపేట): ‘చావో రేవో.. చలో అమరావతి’ పేరుతో ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు భారీగా తరలిరావాలని కాపులకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇది ఆఖరి పోరాటమని, భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ మంగళవారం ఈ మేరకు కాపులకు బహి రంగ లేఖ రాశారు. పోలీసులు ఎన్నిసార్లు అరెస్టు చేసినా ‘పాదయాత్రకు వెళతాం.. కాదంటే జైలుకు పంపుకోండి’ అని ధైర్యంగా చెప్పాలని కాపులకు సూచించా రు. యాత్రలో పాల్గొంటే కేసులు పెడతామంటూ ప్రభుత్వ పెద్దలు పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. -
చావో.. రేవో..చలో అమరావతి
జూలై 26 నుంచి పాదయాత్ర: ముద్రగడ జగ్గంపేట: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమబాట పట్టనున్నారు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని అమలు చేయాలని కోరుతూ పలు దఫాలుగా ఉద్యమాలు నిర్వహించిన ముద్రగడ ఈసారి ‘చావో.. రేవో.. చలో అమరావతి’ పిలుపుతో నిరవధిక పాదయాత్రకు సంకల్పిస్తున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 26న కిర్లంపూడి నుంచి పాదయాత్ర ద్వారా రాజధానికి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
నా పాదయాత్ర రూట్‌మ్యాప్ సీఎంకు పంపిస్తా!
-
పోరాటాలతోనే ఎదుగుదల
‘మాలల రణగర్జన’లో అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ పెదకాకాని(పొన్నూరు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి సమష్టిగా పోరాటాలు చేయడం ద్వారానే మాలలు రాజకీ యంగా ఎదుగుతారని అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అన్నారు. గుంటూరుజిల్లా పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఆది వారం మాలల రణగర్జన జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ‘చలో అమరావతి’ పిలుపులో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బహిరంగసభలో భీమ్రావ్ మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాలలు రాజకీయ శక్తిగా ఎదగడానికి ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. మాలల హక్కుల సాధనకోసం సమతా సైనికదళ్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. మాలమహా నాడు రాష్ట్ర నాయకుడు మల్లెల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ఎస్సీ వర్గీకరణ కుట్రను తెలియజేస్తూ కారం శశిధర్, గౌరీశ్వరరావు సంపా దకులుగా రూపొందించిన పుస్తకాన్ని భీమ్రావ్ ఆవిష్కరించారు.