ఎన్ని ఇబ్బందులున్నా..రిజర్వేషన్లు సాధిస్తాం
బోట్‌క్లబ్ (కాకినాడ) : ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కాపు రిజర్వేషన్ల సాధిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తంచేశారు. స్థానిక పద్మనాభ ఫంక‌్షన్ హాల్ గురువారం కాపు మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్రం
కాపు ఉద్యమనేత ముద్రగడ
మేము సైతం అంటున్న మహిళా నేతలు
బోట్‌క్లబ్ (కాకినాడ) : ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కాపు రిజర్వేషన్ల సాధిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తంచేశారు. స్థానిక పద్మనాభ ఫంక‌్షన్ హాల్ గురువారం కాపు మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మహిళా నాయకురాలు కూడా పాల్గొన్న ముద్రగడ ఉద్యమానికి మద్దతు పలికారు. సదస్సులో ముద్రగడ మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధించేంత వరకూ ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చితే వచ్చే పరిస్థితిపై బీసీల అనుమానాలు నివృత్తి చేసేందుకు బీసీ నాయకులను కలుస్తున్నట్టు చెప్పారు. త్వరలో మరికొంతమందిని కలుస్తానన్నారు. గతంలో ప్రకటించినట్టుగా సత్యగ్రహ యాత్ర చేయనున్నట్టు వెల్లడించారు. గద్దె ఎక్కేందుకే సీఎం చంద్రబాబు కాపులను ఉపయోగించుకున్నారని విమర్శించారు.
ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టిన భయపడేదిలేదని వైఎస్సార్‌సీపీ విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి అన్నారు. ముద్రగడ వెంటే ఉంటామన్నారు. సభాధ్యక్షురాలు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి మాట్లాడుతూ కాపులు రిజర్వేషన్లు సాధించిన తర్వాతే నిజమైన పండుగన్నారు. సినీ నటి హేమ మాట్లాడుతూ ఎంతోమంది కాపులు ఆకలితో అలమటిస్తున్నారని, బీసీల్లో చేర్చితే నిరుపేద కాపులకు ఉపయోగమన్నారు. రిజర్వేషన్లు భవిష్యత్తు తరాలకు ఉపయోగమన్నారు. ముద్రగడ ఉద్యమానికి ఉడతాభక్తిగా సహాయం చేస్తామన్నారు. కాపు మహిళా నాయకురాళ్లు ఉమామహేశ్వరి (శ్రీకాకుళం), శేషులత (విశాఖ అర్భన్), మొగలి సర్వమంగళం(విజయనగరం), ఆకుల జయప్రద (నూజివీడు), మిరయాల రత్నకుమారి (గుంటూరు), పబ్బినీడి మణి, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి లీలావతి, పంతం ఇందిర, పోలిశెట్టి సునీత మాట్లాడుతూ ఏ ఉద్యమం తలపెట్టిన తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు ఐకాస నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, మలకల చంటిబాబు, జానపాముల నాగబాబు , సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.