
ఫైల్‌ఫోటో
సాక్షి, అమరావతి: వచ్చే ఆరు రోజుల పాటు మండలాల వారీగా పొదుపు సంఘాల సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనుంది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు వారు చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను వరుసగా మూడో ఏడాది కూడా ప్రభుత్వమే చెల్లించిన నేపథ్యంలో.. సెర్ప్, మెప్మాల ఆధ్వర్యంలో శనివారం నుంచి 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ ఉత్సవాలను నిర్వహించనున్నారు.
చదవండి: పథకాలు ఆపేయాలట!
సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులతో జరిగే ఈ సమావేశాల్లో.. గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమావేశాల్లో చర్చిస్తారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో రోజుకో మండలం చొప్పున అన్ని మండలాల్లో పాల్గొంటారు. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులను కూడా ఆయా కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment