'కాపులపై కేసులు ఉపసంహరించేది లేదు' | no back step on kapu leaders cases over kapu agitation says chnina rajappa | Sakshi
Sakshi News home page

'కాపులపై కేసులు ఉపసంహరించేది లేదు'

Published Fri, Jun 10 2016 5:54 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

'కాపులపై కేసులు ఉపసంహరించేది లేదు' - Sakshi

'కాపులపై కేసులు ఉపసంహరించేది లేదు'

విజయవాడ: కాపులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. విధ్వంసానికి దిగితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కేసులు పెట్టి ఉపసంహరించడం ఉండదని తెలిపారు.

మరోవైపు తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా బనాయిస్తున్న కేసులను ఉపసంహరించాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్యపరీక్షలతో పాటు చికిత్స చేయించుకోడానికి ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలోని 202 రూమ్‌లో ఆయనను ఉంచారు.  వైద్యులు అనేకసార్లు ఆయనకు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. నిన్న సాయంత్రం తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. పరిస్థితి ఏంటన్నది బయటకు తెలియనివ్వకుండా పోలీసులు ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. పేషెంట్లు, అధికారులు మినహా ఎవరినీ ఆస్పత్రిలోకి రానివ్వడం లేదు. తన డిమాండ్ నెరవేర్చేవరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement