కాపు కార్పొరేషన్ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా కోత పెట్టింది.
విజయవాడ: కాపు కార్పొరేషన్ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. రుణాల కోసం 3 లక్షల 25 వేల మంది దరఖాస్తు చేసుకోగా తొలివిడతగా కేవలం 32 వేల మందిని మాత్రమే బీసీ కమిషన్ ఎంపీక చేసింది. వీరికి గురువారం ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణాలు పంపిణీ చేయనున్నారు.
సబ్సిడిగా ప్రభుత్వం రూ. 90 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ముద్రగడ ఉద్యమం సమయంలో రూ. 500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం దశల వారిగా మంజూరు చేస్తామని కొత్తమాట చెబుతోంది. పెండింగ్ దరఖాస్తులకు మరోసారి మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.