
సాక్షి, హైదరాబాద్: కాపులు బీసీలా... ఓసీలా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని శాసన మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు కాపులను దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు ఎన్నిసార్లు రిజర్వేషన్లు ఇస్తారు చంద్రబాబూ.. అని ప్రశ్నిం చారు. అసెంబ్లీలో కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కేటాయిస్తున్నట్లుగా బిల్లు పెట్టారన్నారు.
కాపులకు రిజర్వేషన్ల అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారా..? లేక వారు అమాయకులని అనుకుం టున్నారా? అని నిలదీ శారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేర్చుతామంటే నమ్మి ఓట్లేశారని, మళ్లీ ఇప్పుడు ఐదు శాతం అంటే ఓట్లు వేస్తారని చంద్రబాబు మరో కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లపై మంజునాథ కమిటీ వేయడానికి చంద్రబాబుకు ఏడాదిన్నర పట్టిందన్నారు. అయితే కాపులను బీసీల్లో చేర్చాలని చెప్పలేదని, బీసీల్లో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉందో సర్వే చేయమన్నారని కమిటీ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment