సాక్షి, గుంటూరు : తెలంగాణలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది చంద్రబాబు నిర్ణయిస్తున్నారంటే కాంగ్రెస్ బతికి ఉంటే ఏంటి.. చనిపోతే ఏంటి అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శించారు. వైఎస్సాఆర్‌సీపీ ఆత్మీయ సదస్సులో పాల్గొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇవాళ రాష్ట్రంలో దుర్మార్గపు రాజకీయం నడుస్తోందంటూ మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన టీడీపీ కాంగ్రెస్‌పార్టీతో కలవటం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌పార్టీ కలవటాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారని అన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతున్నారు..కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నది దేశం కాదు చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబుతో తాను చాలా కాలం పనిచేశానని, ఆయన మనస్తత్వం తనకు బాగా తెలుసునన్నారు. అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ విమర్శించారు. ఈ రాష్ట్రంలో సిట్ విచారణ అంటే సిట్టింగ్ పొజిషన్ అని, జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment