విశాఖపట్నం, సాక్షి: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని.. కాపుల పట్ల సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలో కాపు సామాజిక భవనం భూమి పూజా కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలు పాల్గొని మాట్లాడారు.
సీఎం జగన్ కాపుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కాపులకు రూ. 25 కోట్లు భూమి కేటాయించడమమే ఇందుకు నిదర్శనం. అదీ విశాఖ నడిబొడ్డున.. హైవే పక్కన 50 సెంట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర. కాపులతో పాటు యాదవుల సామాజిక భవనం నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించారు. రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తాను అని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
‘‘రూ. 25 కోట్లు విలువైన 50 సెంట్లు భూమిని కాపు భవనానికి సీఎం జగన్ కేటాయించారు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తాం. విశాఖ నగరంలో ఇప్పటికే అనేక కళ్యాణ మండపాల నిర్మాణం పూర్తి చేశాం. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున 31మంది కాపులు పోటీ చేసేందుకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఆ 31 మందిలో 29 విజయం సాధించారు. ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల ఆరాధ్య దైవం రంగాను చంపిన వారికి.. ముద్రగడ పద్మనాభంను అవమానించిన వారికి మద్దతు చెబుతారో.. కాపులకు మేలు చేసిన వారికి అండగా ఉంటారో మీరే(కాపులను ఉద్దేశించి..) నిర్ణయించుకోవాలని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు ఇచ్చారు.
అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేశారు. కాపు నేస్తం పథకం ప్రవేశ పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కులగణన చేపట్టారు. కాపు బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారు. కాపులకు సేవ చేసేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటాం అని బొత్స ఝాన్సీ అన్నారు.
ఇంకా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీదర్, కొండా రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment