టీడీపీ నేతల గూండాగిరిపై కాపుల కన్నెర్ర  | Kapu protest at Dr BR Ambedkar statue in Guntur | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల గూండాగిరిపై కాపుల కన్నెర్ర 

Published Sat, Oct 28 2023 3:41 AM | Last Updated on Sat, Oct 28 2023 3:41 AM

Kapu protest at Dr BR Ambedkar statue in Guntur - Sakshi

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌): వంగవీటి రంగాను హత్య చేయడంతోపాటు ముద్రగడ పద్మనాభంను మానసికంగా చంపేశారని.. ఇలా అన్ని రంగాల్లో కాపులను టీడీపీ నేతలు అణగదొక్కుతూనే వచ్చారని అఖిల భారత కాపు అభ్యున్నతి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారని.. ఇకపై ఇలాంటి దాడులు చెల్లవని పేర్కొంది.

గతంలో కూడా అంబటిపై దాడి చేశారని.. పదే పదే కాపులపై దాడులకు తెగబడితే తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించింది. మంత్రి అంబటిపై టీడీపీ గూండాల దాడిని ఖండిస్తూ అఖిల భారత కాపు అభ్యున్నతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాపులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతల గూండా గిరిపై కన్నెర్ర చేశారు.

ఆలిండి­యా కాపు అభ్యున్నతి సంఘం జిల్లా అధ్యక్షుడు, గుంటూరు మిర్చియార్డు డైరెక్టర్‌ సతీష్‌ మాట్లాడుతూ టీడీపీకి మొదటి నుంచి కూడా కాపుల పట్ల చిన్నచూపే ఉందని విమర్శించారు. కాపు నేత కాకి శ్రీను మాట్లాడుతూ తమ మౌనా­న్ని చేతగానితనంగా భావిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మిర్చియార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ ఎర్రబాబు, కాపు నేతలు కోట రాందాస్, గేదెల రమేష్, యిర్రిసాయి, రాతంశెట్టి మన్నార్, నరాలశెట్టి అర్జున్, కారసాని వెంకట్, రవి నాయుడు, డి.జయ, రేజేటి నవీన్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement