
విద్యార్థినికి ఆర్థికసాయం అందిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని మాధవనగర్ ప్రాంతానికి చెందిన ఊట్కురి రుక్కయ్య కూతురు శ్రీలక్ష్మి ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు సాధించినప్పటికీ చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. శ్రీలక్ష్మి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు మొదటగా రూ.లక్షా యాభై వేలు సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు.
ఎంపీ కోమటిరెడ్డి తమకు దేవుడిలా సహాయం అందించారని, తమ కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని రుక్కయ్య అన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment