రామచంద్రపురం: సైంటిస్ట్ ఆస్ట్రోనాట్‌గా ఎదగాలని కలలుగన్న ఓ యువతి ఆకాంక్షలకు ప్రభుత్వ సాయం తోడైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు అంతరిక్ష రంగంపై విపరీతమైన మక్కువ. అమెరికా నాసా శిక్షణకు ఎంపికైన ఈమెకు ఆర్థిక ఇబ్బంది తలెత్తింది.
బీసీ సంక్షేమ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే సీఎం ఈ శిక్షణ కోసం ఆమెకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో అమెరికాలోని నాసా అంతరిక్ష కేంద్రంలో నెల పాటు శిక్షణ పొందింది.
ఇటీవల జాహ్నవి స్వస్థలం చేరుకుంది. మరికొన్నాళ్లు ఆమె శిక్షణ పొందాల్సి ఉంది. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణును కలిసింది. చిరకాల స్వప్నమైన సైంటిస్ట్ ఆ స్ట్రోనాట్ కావడానికి సహకారాన్ని అందజేసిన సీఎం జగన్‌కు, మంత్రి వేణుకు కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment