వాషింగ్టన్ : 'చాలా మంచి ఆలోచన.. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను' అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ అమెరికన్ సెనేటర్‌పై ప్రశంసలు గుప్పించారు. ఆ సెనేటర్ చేసిన ఆలోచనకు ముగ్దుడైపోయారు అది ఎందుకనుకుంటున్నారా.. పాకిస్థాన్‌కు సంబంధించిన విషయంపైనే.. అవునూ.. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ర్యాండ్ పౌల్ ఓ బిల్లును తెరపైకి తెచ్చారు. అందులో పాక్‌కు నిధులు నిలిపివేసే అంశమే ఉంది. ఇది చూసిన ట్రంప్ వెంటనే ఆయనకు ఓ వీడియోతో సహా ప్రశంసలతో కూడిన ట్వీట్ చేశారు.
'మంచి ఆలోచన ర్యాండ్. ఉగ్రవాదంపై పాక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేనందున ఈ నిధులు ఆపేయాలంటూ తెచ్చిన బిల్లు బావుంది. మన దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచేందుకు ఆ డబ్బు వినియోగిద్దామన్న ఆలోచన మంచిది' అని ట్రంప్ చెప్పారు. పాక్ ఉగ్రవాదాన్ని తుదముట్టించని కారణంగా ప్రతి ఏటా అమెరికా చేస్తున్న ఆర్థిక సాయం నిరర్ధకమవుతోందని, ఈ ఏడాది ఆ డబ్బును పంపిచడం ఆపేసి దాంతో దేశంలో రహదారులు, వంతెనలువంటి మౌలిక సదుపాయాలకు ఉపయోగించుదామని సెనేటర్ ర్యాండ్ బిల్లును తెచ్చారు. దాదాపు రెండు బిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా ఆపేసిన విషయం తెలిసిందే.
పాక్‌కు ఇచ్చే డబ్బుతో మన రోడ్లేయ్యండి : ట్రంప్
Published Sat, Jan 6 2018 8:10 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment