సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించే అంశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. త్వరలో అమల్లోకి రానున్న ఈ పథకానికి సంబంధించిన వివరాలను సీఎం ప్రకటిస్తారన్నారు. మైనారిటీ సంక్షేమానికి ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో రూ.2,200 కోట్లు కేటా యించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.
వివిధ విభాగాల కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమి తులైన మైనారిటీ నేతలను గురువారం జల విహా ర్‌లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చెప్పే మాటలకు పొంతన ఉండదని, దేశంలో నేటి కీ ముస్లింలు పేదలుగా మిగలడానికి ఆ పార్టీయే కారణమన్నారు.
కాంగ్రెస్ పదేళ్ల పాలనలో మైనా రిటీ సంక్షేమానికి వెచ్చించిన మొత్తం కంటే ఒక్క ఏడాదిలో తమ ప్రభుత్వం ఖర్చు చేసిందే ఎక్కు వగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు షకీల్, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో గంగా జమున తహజీబ్
మైనారిటీ వర్గాలను సీఎం కేసీఆర్ ఎంతగానో గౌరవిస్తారనేందుకు మహమూద్ అలీని రెండు పర్యాయాలు మంత్రిగా చేయడమే నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గంగ జమున తహజీబ్‌ను అమలు చేస్తున్నారని.. మైనారిటీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్, షాదీ ముబారక్ వంటి ఎన్నో పథ కాలు ఇస్తున్నారని చెప్పారు.
పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న మైనార్టీ నేతలను హరీశ్‌రావు, మహమూద్ అలీ సన్మానించారు. సన్మానం అందుకున్న మైనారిటీ నేతల్లో మేడే రాజీవ్ సాగర్, ముజీబ్ ఉద్దీన్, తన్వీర్, ఇంతియాజ్, తారిక్ అన్సారీ, సలీం, అక్బర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment