
నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎం.ప్రేమ్‌హర్షవర్ధన్‌కు కలెక్టర్ ఎల్.శివశంకర్ రూ.లక్ష చెక్కు అందజేశారు. హర్షవర్ధన్ గత నెల 26న అనంతపురంలో సీఎం జగన్ నిర్వహించిన జగనన్న వసతి దీవెన సభకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి తాను పడుతున్న ఇబ్బందులను వివరించి ఆదుకోవాలని వేడుకున్నాడు.
స్పందించిన ముఖ్యమంత్రి బాధితుడ్ని ఆదుకోవాలని, వైద్యసేవలు అందేలా చూడాలని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వివరాలను పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ స్పందించి తక్షణ సాయంగా రూ.లక్ష చెక్కును బాధితుడికి సోమవారం కలెక్టరేట్‌లో అందజేశారు. హర్షవర్ధన్ గుండెలో పేస్‌మేకర్ అమర్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూఅధికారి కె.వినాయకం, జిల్లా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్. సునీల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment