సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల చిరుప్రాయం.. ఆడుతూపాడుతూ గడపాల్సిన బాల్యం.. కానీ అనూహ్యంగా తీవ్ర డెంగీ జ్వరం బారినపడటం ఆ చిన్నారి ప్రాణాలకు ముప్పుగా మారింది. చికిత్సకు రూ. లక్షలు అవసరం కావడంతో ఆ చిన్నారి కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌కు చెందినవి. వినీల మూడేళ్ల కుమారుడు వి. వేదార్యన్ ఇటీవల తీవ్ర డెంగీ జ్వరంబారిన పడ్డాడు.
ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే వివిధ అవయవాలు వైఫల్యం చెందాయి. ప్రస్తుతం ఆ బాలుడిని కుటుంబ సభ్యులు రెయిన్‌బో పిల్లల ఆస్పత్రిలోని పీఐసీయూ వార్డుకు తరలించారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడంతో హార్ట్ అండ్ లంగ్ బైపాస్ మెషీన్ (వీఏ–ఎక్మో) ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తున్నారు. అయితే ఖరీదైన ఈ చికిత్సలకు మరో రూ. 15 లక్షలు అవసరమని, దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని బాలుడి తల్లి వినీల కోరారు. దాతలు milaap.org/fundraisers/support-v-vedaryan?deeplink_type= ద్వారా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment