కానిస్టేబుల్‌కు సహచరుల ఆర్థికసాయం | Financial Aid To Conistable | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌కు సహచరుల ఆర్థికసాయం

May 23 2018 12:31 PM | Updated on Mar 19 2019 9:03 PM

Financial Aid To Conistable - Sakshi

బాధితుడికి చెక్కు అందిస్తున్న ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ 

ఆదిలాబాద్‌: రోడ్డు ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను తన బ్యాచ్‌ కానిస్టేబుళ్లు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్‌ కెరమెరి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న హజీపూర్‌ మండలం రాపెల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందగా కుడికాలు పూర్తిగా తొలగించారు. మూడు నెలల నుంచి ఇంటి వద్ద ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్‌ పరిస్థితి తెలుసుకున్న కానిస్టేబుళ్లు రూ.50 వేలు జమ చేసి.. మంగళవారం జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కానిస్టేబుళ్లను అభినందించారు.

కృత్రిమ కాలు అమర్చే విధంగా ఆర్థిక సాయం అందజేయాలని కుమురంభీం జిల్లా ఎస్పీ సింగనేవార్‌ కల్మేశ్వర్‌ను కోరుతామని అన్నారు. అదనపు ఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సభ్యులు దేవిదాస్, ఇసాక్, శ్రీనివాస్, ఎండి.యూనుస్, సురేష్, గజానన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement