వచ్చే ఐదేళ్లలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా... అనిశ్చిత వాతావరణం కొనసాగొచ్చన్న అభిప్రాయంతో మెజారిటీ ఇండియన్లు..
కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల వ్యయం, వైద్యఖర్చులు తదితరాల పెరుగుదలపై 88 శాతం భారతీయుల ఆందోళన
ఆర్థిక అనిశ్చితితో పాటు ఉద్యోగాలు, అప్పులు, మారనున్న రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలు ప్రభావితం చేయొచ్చనే అంచనాలు
ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రణాళికలు.. ∙ఇన్సూరెన్స్ పాలసీలు 77 శాతం మంది, ఫిక్స్‌డ్ డిపాజిట్లు 49 శాతం
మ్యూచువల్ ఫండ్స్/స్టాక్స్‌లో 46 శాతం, పెన్షన్‌పై ధీమా/సజావుగా సాగుతున్న వ్యాపారాలు 42 శాతం ఎలాంటి ఆర్థిక రక్షణలు ప్లాన్ చేయనివారు 6 శాతం
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ ‘అనిశ్చిత్ ఇండెక్స్’తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భారతీయులను ‘ఆర్థిక అనిశ్చితి’భయాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులతోనే కాకుండా రాబోయే ఐదేళ్లలో చోటుచేసుకోబోయే అనూహ్య పరిస్థితులపై కూడా వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే ఐదేళ్లలో భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం కొనసాగొచ్చన్న అభిప్రాయంతో మెజారిటీ భారతీయులు ఉన్నారు.
ఇదే సమయంలో భారత్‌తో సహా దాదాపుగా అన్ని ప్రపంచ దేశాల్లోని ప్రజలను ఆర్థిక అనిశ్చితి భయపెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికరంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా...రాబోయే ఐదేళ్లలోనూ ఇదే స్థితి కొనసాగుతుందా? పరిస్థితులు మరింత దిగజారుతాయా అన్న ఆందోళన వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.
కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల వ్యయం, వైద్యఖర్చులు, తదితరాల పెరుగుదలతో వచ్చే ఐదేళ్లలో మనదేశంతో పాటు వివిధ దేశాల్లో ఆర్థిక అస్థిరత, నిలకడలేని వాతావరణం కొనసాగుతుందని 88 శాతం భారతీయులు భావిస్తున్నారు. ఈ అనిశ్చితితో పాటు ఉద్యోగాలు, అప్పులు, రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలు కూడా తమ జీవితాలతో ముడిపడిన ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక అనిశ్చితితో తమకు వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు, అప్పులు, ఊహించని ఖర్చుల పెరుగుదలతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళన వంటి వాటికి దారితీస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి, దానిని ప్రభావితం చేసే అంశాలు తదితరాలపై తాజాగా ‘అనిశి్చత్ ఇండెక్స్’నివేదికను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,978 మంది వ్యక్తుల (5,320 మంది వేతన జీవులు, 2,658 మంది బిజినెస్ ప్రొఫెషనల్స్) నుంచి సేకరించిన సమాచారం, వివరాల మేరకు ఈ నివేదికను సిద్ధం చేశారు.
ఈ సర్వే ముఖ్యాంశాలు ఇవీ...
» భారతీయులకు పెరుగుతున్న ఖర్చులే అతి పెద్ద అనిశ్చితి..
» కుటుంబ ఖర్చుల పెరుగుదలతో ఇబ్బంది పడొచ్చని భావిస్తున్నవారు 77 శాతం మంది
» ఆరోగ్యం, జీవితంలో అనిశ్చితి, అప్పుడు, ఊహించని ఖర్చులు రావొచ్చునని అంచనా వేస్తున్నవారు 71 శాతం మంది
» ఆర్థిక అనిశ్చితి ఎదురుకావొచ్చుననే భావనలో 67 శాతం
» రాజకీయ అనిశి్చతితో ఇబ్బందులు ఎదురుకావొచ్చుననే అభిప్రాయంతో ఉన్న వారు 65 శాతం
» చేస్తున్న ఉద్యోగాల్లో మార్పుచేర్పుల అనిశ్చితి ఏర్పడొచ్చునంటున్న వారు 64 శాతం
» వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావంతో అనిశ్చితి ఉండొచ్చుననే భావనతో 62 శాతం
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడొచ్చా అన్న దానిపై ఏమన్నారంటే...
» 88 శాతం మంది వచ్చే 5 ఏళ్లలో భారత్‌తో సహా ప్రపంచదేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొనవచ్చుననే భావనతో ఉన్నారు.
» 10 శాతం మంది ఈ అనిశ్చితి తక్కువస్ధాయిలో ఉండొచ్చునని నమ్ముతున్నారు.
» 2 శాతం మందికి ఇది అతి స్వల్పంగా లేదా అసలు ఉండకపోవచ్చుననే అభిప్రాయం
ఈ అనిశ్చితిని అధిగమించేందుకు ‘ఫైనాన్షి యల్ ప్లానింగ్’ఏ మేరకు తోడ్పడుతుంది ?
» ఆర్థిక ప్రణాళికల సాయంతో ఈ అనిశ్చితిని తగ్గించవచ్చునని నమ్ముతున్నవారు 46 శాతం మంది
» ఈ విషయంలో ‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను గట్టిగా సమరి్థస్తున్నవారు 37 శాతం
» ఈ ప్లానింగ్ పట్ల పెద్దగా మేలు జరగదని భావిస్తున్నవారు 13 శాతం
» దీనిని పూర్తిస్థాయిలో నిరాకరిస్తున్న వారు 4 శాతం మంది
అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆర్థిక సురక్షితలు ఉపయోగపడతాయి?
» 77 శాతం మంది ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ పాలసీ అతిపెద్ద ఆర్థిక సురక్షితగా భావిస్తున్నారు.
» 49 శాతం రాబోయే రోజుల్లో ఏవైనా ఆర్థికపరమైన సవాళ్లు వస్తే ఎదుర్కునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిలో కొంత మొత్తం జమచేశామని చెబుతున్నారు.
» 46 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్/ స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టినట్టుగా వెల్లడించారు.
» 42 శాతం మంది పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉందని, తాము ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం లాభదాయకంగా ఉన్నట్టుగా తెలిపారు.
» 6 శాతం మంది మాత్రం తాము ఎలాంటి ఆర్థిక సురక్షితలను సిద్ధం చేసుకోలేదని పేర్కొన్నారు.
‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను సమీక్షిస్తుంటారా ?
» 37 శాతం మంది తమకు తాముగా ఇలాంటి సమీక్షలు చేయడం లేదు. తమ తరఫున సీఏలు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లు తమ బాధ్యతను తీసుకుంటున్నట్టు తెలిపారు.
» 22 శాతం మంది ఏడాదికి ఒకసారి లేదా అంతకంటే తక్కువ కాలంలో సమీక్షిస్తామన్నారు.
» 15 శాతం మంది 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు.
» 14 శాతం మంది 6 నెలలకు, 14 శాతం నెలకు ఒకసారి ఈ పనిచేస్తామన్నారు.
భవిష్యత్‌లో చోటుచేసుకునే పరిణామాల్లో ఏ అంశం అధిక ఆందోళనకు కారణమవుతోంది?
» 64 శాతం మంది ఉద్యోగ, వృత్తిపరంగా ఎదురయ్యే ఒడిదుడుకులు, పురోగతిపైనే అని వెల్లడి.
» 61 శాతం దీర్ఘకాలిక ఆర్థిక పరమైన లక్ష్యాలు ఆందోళనకు గురిచేస్తున్నా
యంటున్నారు.
» 58 శాతం మంది తమ/కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనే ఎక్కువ ఆందోళన ఉన్నట్టుగా తెలిపారు.
» 39 శాతం మంది కుటుంబసభ్యులు/ స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటాయనే దానిపై సందిగ్ధతతో ఉన్నట్టుగా పేర్కొన్నారు.
ఇదీ అధ్యయనం...
ఆర్థిక అనిశి్చతితో తలెత్తే పరిస్థితులు, ఇబ్బందులను ఎదుర్కునేందుకు వివిధవర్గాల ప్రజలు తమ తమ ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను పునర్ నిర్దేశించుకోవడానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సురక్షిత స్థితికి చేరేందుకు అవసరమైన మార్గాల అన్వేషణ, అప్పులను తెలివిగా నిర్వహించడం, పెట్టే ఖర్చులను జాగ్రత్తగా వ్యయం చేయడం, డబ్బు పొదుపు వంటి వాటికి ప్రజలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టుగా పేర్కొంది.
రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితిని అధిగమించేందుకు వివిధ రంగాలకు చెందినవారు అనుసరించే ప్రణాళికలు, ముందస్తు ఆలోచనలను బట్టి చూస్తే... ఇన్సూరెన్స్ పాలసీలు 77 శాతం మంది, ఫిక్స్‌డ్ డిపాజిట్లు 49 శాతం, మ్యూచువల్ ఫండ్స్/స్టాక్స్‌లో 46 శాతం, పెన్షన్‌పై ధీమా/సజావుగా సాగుతున్న వ్యాపారాలున్న వారు 42 శాతం, ఎలాంటి ఆర్థిక రక్షణ ప్రణాళికలున్‌చేయనివారు 6 శాతం ఉన్నట్టు ఆదిత్య బిర్లా స¯న్‌లైఫ్ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment