లక్నో: ట్రిపుల్ తలాక్ బాధితులు పునరావాసం పొందే వరకు ఆర్థిక సహాయం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బాధితులతో పాటు భర్త నుంచి విడాకులు పొందిన అన్ని మతాలు, వర్గాలకు చెందిన మహిళా బాధితులు వార్షిక సహాయం కింద ఏడాదికి రూ. ఆరు వేలు పొందనున్నారు. ఈ ప్రయోజనాలను బాధితులకు 2020 నుంచి వర్తించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయ సహాయం కూడా అందేలా సీఎం యోగీ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.
యూపీ రాష్ట్ర మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందడానికి వీలుగా.. సరళరీతిలో ప్రక్రియను రూపకల్పన చేశారు. ఆర్థిక ప్రయోజనాలను పొందాలంటే సదరు బాధిత మహిళ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కోర్టు కేసుకు సంబంధించిన కాపీని ప్రూఫ్ కింద సమర్పించాల్సి ఉంటుంది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 5,000 మంది ట్రిపుల్ తలాక్ బాధితులతో సహా దాదాపు 10,000 మంది మహిళలు నేరుగా లబ్ధి పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment