దక్షిణ డిస్కంలో బదిలీలు | South Telangana Electricity Distribution Issued Guidelines For Transfer Of Electricity Employees | Sakshi
Sakshi News home page

దక్షిణ డిస్కంలో బదిలీలు

Published Fri, Jun 10 2022 12:48 AM | Last Updated on Fri, Jun 10 2022 12:48 AM

South Telangana Electricity Distribution Issued Guidelines For Transfer Of Electricity Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. సబ్‌ ఇంజనీర్లతో పాటు అకౌంట్స్‌ విభాగంలో జేఏఓల కేడర్‌ వరకు, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగాల ఉద్యోగుల బదిలీకి దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 30 నాటికి మూడేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఒకేచోట పనిచేసే వారిని బదిలీ చేయనున్నారు.

సీని యారిటీ ప్రాతిపదికగా మొత్తం ఉద్యోగుల్లో 40% మందికి మించకుండా బదిలీలు చేపట్టనున్నారు. ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కల్పించనున్నట్లు పేర్కొంది. బదిలీకానున్న వారి జాబితాను ఈనెల 13న డివిజనల్‌/సర్కిల్‌ కార్యాలయాలకు అందజేయనున్నారు. జాబితాపై 17 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారని, విజ్ఞప్తులుంటే 21లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 28లోగా బదిలీలపై ఉత్తర్వులు జారీ కానుండగా.. బదిలీ అయిన ఉద్యోగులు 30న రిలీవ్‌ కావాలని సంస్థ ఆదేశించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement