లక్డీకాపూల్: ప్రజాభవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి అర్జీల వరద కొనసాగుతోంది. మంగళవారం 2,717 దరఖాస్తులు అందగా, వాటిని కంప్యూటరైజ్డ్ చేసి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) విభాగానికి ప్రభుత్వం బాధ్యతలప్పగించింది. దరఖాస్తుల సంఖ్య పె రుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
మంగళవారం ఉపాధ్యాయుల దంపతుల బదిలీపై స్పౌజ్ ఫోరం ప్రతినిధులు భారీగా ప్రజావాణికి తరలివచ్చారు. స్పౌజ్ ఫోరం ప్రతినిధు లు వివేక్, నరే‹శ్, అర్చన, సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలోని అశాస్త్రీయ విధానా లవల్ల భర్త ఒకచోట, భార్య మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే బదిలీ లు చేపట్టాలని కోరారు.
మహిళా సమాంతర రిజర్వేషన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఏఈఈ గ్రూప్–4 ఫలితాలను విడుదల చే యాలని పలువురు నిరుద్యోగులు ప్రభుత్వాని కి మొరపెట్టుకున్నారు. నిరుద్యోగ ప్రతినిధులు నాగులు సాయికిరణ్, పవన్, శరత్ మీడియా తో మాట్లాడుతూ.. హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో అనవసరమైన కాలయాపన చేయకుండా మెమో నెం.7593ను ప్రకారం డాక్యు మెంట్ వెరిఫికేషన్ జాబితాను పదిహేను రోజు ల్లో విడుదల చేయాలని కోరారు.
నా భర్త ఉద్యోగం ఇవ్వండి
విధి నిర్వహణలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన జెన్‌కో ఉద్యోగి సదానందన్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుని భార్య వందన సదానందన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సాయం అందలేదనీ, ఇప్పటికైనా భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment