
న్యూఢిల్లీ: గత నెల రైల్వే శాఖ ప్రకటించిన 89 వేల ఉద్యోగాలకు కోటిన్నరమంది పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి దశ దరఖాస్తులో భాగంగా అభ్యర్థులు పేరు, చిరునామా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తు నింపి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రాథమిక దశలో 1.5 కోట్ల మంది పేరు నమోదు చేసుకున్నట్లు వివరించారు. రైల్వే గ్రూపు –సిలోని 26,502, గ్రూపు–డిలోని 62,907 ఉద్యోగాలకు గాను గత నెలలో ప్రకటన వెలువడింది. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈ నెల 31 వరకు పొడిగించామన్నారు.