సాక్షి, అదిలాబాద్ : ఉపాధి నిమిత్తం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లిన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయెన్‌లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరు స్థానికంగా ఉండకపోవడంతో సంబంధిత రెవెన్యూ అధికారులు వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీరికి ఒక అవకాశం కల్పించింది. 6ఏ ఫారం ద్వారా గల్ఫ్, వివిధ దేశాల్లో ఉంటున్న వారు సైతం ఆన్‌లైన్‌లో తమ పాస్‌పోర్టు జిరాక్స్‌ను జతపరిచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వివరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు విచారణ చేపడతారు. అనంతరం ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేస్తారు. కానీ విదేశాల్లో ఉండి మాత్రం ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. సొంత గ్రామానికి వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది.
ఎంబసీలు, సామాజిక సంస్థలు చొరవ చూపాలి
18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత దేశంలో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఎన్నారైలను ఓటర్లుగా నమోదు చేయడానికి భారత రాయబార సామాజిక సంస్థలు చొరవ చూపాలి. http: //www.nvsp.in/ Forms/Forms/form6a?langen& GB ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ http://eci.nic.in లేదా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ http://ceotelangana.nic.in/ను చూడవచ్చు. ఎన్నారైలు ప్రాగ్జీ ఓటింగ్ (ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) అవకాశాల గురించి భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నది. పోస్టల్ బ్యాలెట్, ఈ-బ్యాలెట్‌లేదా ఎంబసీల ద్వారా ప్రవాసులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment