డీఎస్పీగా హిమా దాస్‌ నియామకం  | Hima Das Appointed Deputy Superintendent In Assam Police | Sakshi
Sakshi News home page

డీఎస్పీగా హిమా దాస్‌ నియామకం 

Feb 27 2021 12:00 AM | Updated on Feb 27 2021 8:16 AM

Hima Das Appointed Deputy Superintendent In Assam Police - Sakshi

డిస్పూర్‌: భారత స్టార్‌ అథ్లెట్‌ హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో గౌరవించింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) పదవిలో నియమించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో 21 ఏళ్ల హిమా దాస్‌కు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ నియామక పత్రాలు అందజేశారు. 2018లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement