సాక్షి ఎఫెక్ట్..
కళ్యాణదుర్గం: పెన్నానది, వేదావతి నగరి పరివాహాక ప్రాంతాలతో పాటు వంక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తోడే వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోండని ఎస్‌ఐలను డీఎస్పీ టీఎస్ వెంకటరమణ ఆదేశించారు. ఇసుక తోడేళ్లతో రైతులకు శాపం’ శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. కళ్యాణదుర్గం సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలకు ఫోన్లో డీఎస్పీ మాట్లాడారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిఘా ఉంచి దాడులు చేసి ఇసుక అక్రమార్కులను పట్టుకోవాలన్నారు. దీంతో కంబదూరు ఎస్‌ఐ నరసింహుడు మండల పరిధిలోని పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమ రవాణా దారులను పట్టుకునేందుకు పర్యటించారు. సాక్షిలో వచ్చిన కథనం కారణంగా ఇసుక రవాణాను చేయడానికి ఎవరూ పూనుకోకపోవడంతో పోలీసులకు పట్టుబడలేదు. ఇదే తరహాలోని బ్రహ్మసముద్రం మండలం వేదావతి, కళ్యాణదుర్గం మండలంలో పెన్నానది పరివాహక ప్రాంతాల్లో సంబంధిత ఎస్‌ఐలు ఇసుక అక్రమార్కులను పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇసుక తోడే వారిపై నిఘా పెట్టండి
Published Sat, Aug 5 2017 9:25 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement